ఆ రెండు ఎంపీ సీట్లు జనసేన ఖాతాలోకే..: పవన్

  • IndiaGlitz, [Monday,March 11 2019]

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగరా మోగడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీకి దీటుగా ఇప్పటికే పోరాట యాత్ర పేరుతో జనాల్లోకి పవన్ జిల్లాలన్నీ తిరిగి అభిమానులు, కార్యకర్తలు, తటస్థులందర్నీ కలిశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. 24 గంటల తిరగకముందే పవన్ ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు.

ఇద్దరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన..

రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్‌‌ను జనసేన ప్రకటించింది. సోమవారం సాయంత్రం ఈ ఇద్దరు అభ్యర్థులను పేర్లను ఖరారు చేసిన పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ ప్రకటించడం జరిగింది. కాగా.. డీఎంఆర్ శేఖర్ ఓఎన్జీసీలో ఉన్నతాధికారిగా పనిచేశారు. సోమవారం రోజునే పవన్ సమక్షంలో డీఎంఆర్ కండువా కప్పుకోగా.. కొన్ని నిమిషాలకే ఆయన్ను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. జనసేన ముందుగా కైవసం చేసుకోబోయే రెండు ఎంపీ సీట్లు రాజమండ్రి, అమలాపురం. ఆకుల ఎంపీ అయ్యి ఇదే ఆఫీసుకు వస్తారన్నారు. డీఎంఆర్ జనసేనలో చేరడం చాలా ఆనందంగా ఉంది. బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాలనే డీఎంఆర్ తపన నన్ను కదిలించింది.

నన్ను నమ్మి పార్టీలోకి వచ్చినందుకు డీఎంఆర్‌కు ధన్యవాదాలు. మరోవైపు.. ఆకుల సత్యనారాయణ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆకుల కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య పరిష్కారం కోసం నాతో పాటు ఆకుల కుటుంబం నిరాహార దీక్షకు కూర్చుంది.

More News

50 ఓట్లు కూడా రావన్నావ్.. లవ్ యూ శివాజీ!

"మిత్రమా శివాజీ.. నాకు 50 ఓట్లు కూడా రావు అని అన్నావ్.. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్‌ కావు అన్నావ్(ఓపెన్‌గా మాట్లాడుతున్నా) ఇవాళ 70 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను.

మేమేంటో చూపిస్తాం: జీవితా రాజశేఖర్

‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పదేపదే చెప్పినా వినకండా యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ బరిలోకి దిగారని జీవితా చెప్పుకొచ్చారు. కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె..

'జెర్సీ' ఏప్రిల్ 19 విడుదల

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో

శ్ర‌ద్ధా స్థానంలో స‌నా ఖాన్‌

హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్‌కు నిరాశే మిగిలింది. ఎందుకంటే తెలుగు నుండి ఇటీవ‌ల శాండీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్ర‌ద్ధాదాస్‌.. త‌మిళ ఇండ‌స్ట్రీలో రాణించాల‌నుకుంది. అయితే ఈ అమ్మ‌డు ఆశ‌లు స‌న్న‌గిల్లాయి.

భ‌క్తి చిత్రంలో అనుష్క‌

అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి వంటి చిత్రాల్లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆయా పాత్ర‌ల‌కు ప్రాణం పోసిన న‌టి అనుష్క‌..