Tamil »
Cinema News »
సప్తగిరి ఎనర్జి చూస్తుంటే సప్తగిరి ఎక్స్ ప్రెస్ చూడాలి అనిపిస్తుంది ఖచ్చితంగా చూస్తాను - పవన్ కళ్యాణ్
సప్తగిరి ఎనర్జి చూస్తుంటే సప్తగిరి ఎక్స్ ప్రెస్ చూడాలి అనిపిస్తుంది ఖచ్చితంగా చూస్తాను - పవన్ కళ్యాణ్
Sunday, November 6, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి తొలిసారి హీరోగా నటిస్తున్నచిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించిన సప్తగిరి ఆడియో ఆవిష్కరణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై సప్తగిరి బిగ్ సీడీని, ఆడియో సీడీని రిలీజ్ చేసి తొలి సీడీని సప్తగిరికి అందచేసారు.
ఈ సందర్భంగా ఎం.పి శివప్రసాద్ మాట్లాడుతూ... కృష్ణవంశీ గారు నన్ను విలన్ గా పరిచయం చేసారు. రాజకీయాల్లో ఉండడడం వలన ఇటీవల సినిమాల్లో నటించడం కాస్త తగ్గించాను. మళ్లీ ఈ సినిమాలో ఓ మంచి పాత్ర పోషించాను. కమెడియన్స్ హీరోగా మారి సక్సెస్ అయిన ఆలీ, సునీల్ వలే సప్తగిరి కూడా సక్సెస్ అవుతాడు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఓసారి అశ్వనీదత్ గారు పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసారు. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నాతో ఎం.పి పాత్ర చేయించారు. ఆతర్వాత నిజంగానే ఎం.పి అయ్యాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
హేమ మాట్లాడుతూ... నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ ని. పవర్ స్టార్ తో చాలా సినిమాల్లో నటించాను. నేను ఇప్పటి వరకు కామెడీ రోల్స్ చేసాను. మదర్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్న టైమ్ లో సప్తగిరి గారు ఫోన్ చేసి ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చేయమన్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత నాలో ఇంత విలనిజం ఉందా అనుకుంటారు. ఈ సినిమాలో విలన్ గా నటించడం నాకు ఓ మంచి అవకాశంగా భావిస్తున్నాను. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
ఆలీ మాట్లాడుతూ... రాజబాబు గారు సర్కార్ ఎక్స్ ప్రెస్ అనే సినిమా తీసారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నటుడు అయ్యాడు. ఇప్పుడు హీరో అయ్యాడు. నేను హీరో అవుతాను అని అనుకోలేదు. యమలీల రెండు వారాలు ఆడితే చాలు అనుకున్నాను సంవత్సరం ఆడింది. సునీల్ ఎన్నో కష్టలు పడి కమెడియన్ గా, ఫైటర్ గా, ఏక్టర్ గా, హీరోగా గొప్పపేరు సంపాదించాడు. రేలంగి, చలం, రాజబాబు, నేను, సునీల్ ఇప్పుడు సప్తగిరి హీరో అవ్వడం ఆనందంగా ఉంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నప్పుడు లాటరీ తగిలింది అనుకో..! హీరోగా ఇంకో సినిమా సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు. కథ బాగుంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందులో అద్భుతమైన కథ ఉంది. మంచి టీమ్ తో ఈ సినిమాని తీసారు. సప్తగిరి నువ్వు హీరో అయినా కామెడీ వదలద్దు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కడా ఆగకుండా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... సప్తగిరి ఊతపదం అరాచకం. ఈ సినిమాలో సాంగ్ చూస్తుంటే నిజంగానే అరాచకంలా ఉంది. అద్భుతాలు అనుకుంటే చేయలేం జరగాలి..! అలాంటి అద్భుతమే సప్తగిరి ఎక్స్ ప్రెస్. తను ఏం చేయగలడో క్లారిటి ఉంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సప్తగిరి బాగా దగ్గర అవుతాడు. సప్తగిరిని ఆశ్వీరదించడానికి వచ్చిన పవర్ స్టార్ గార్కి మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
సునీల్ మాట్లాడుతూ... సప్తగిరి ఈ సినిమా గురించి ముందు చెప్పాడు. డాలీ ఫోన్ చేసి కళ్యాణ్ గారితో చేస్తున్న సినిమాకి కాటమరాయుడు టైటిల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ...ఈ టైటిల్ సప్తగిరి సినిమాకి పెట్టారని చెప్పాడు. నేను సప్తగిరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే.. నేను కళ్యాణ్ గారికి టైటిల్ ఇవ్వడం ఏమిటి..? ఇది ఆయన టైటిలే అన్నాడు. పది మందికి సేవ చేసే అదృష్టం దేవుడు కొద్ది మందికే ఇస్తాడు. అలాంటి అదృష్టం కళ్యాణ్ గారికి ఇచ్చాడు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ... కళ్యాణ్ గారితో డాలీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాం. ఈ చిత్రానికి కాటమరాయుడు టైటిల్ అయితే బాగుంటుంది అనుకున్నాం. అయితే...ఈ టైటిల్ అప్పటికే సప్తగిరి సినిమాకి పెట్టారు. 60 % షూటింగ్ కూడా పూర్తయ్యింది అని తెలిసింది. కళ్యాణ్ గారికి తెలిస్తే అడగద్దు అంటారు అని మేమే అడిగాం వెంటనే ఏం ఆలోచించకుండా కాటమరాయుడు టైటిల్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి కళ్యాణ్ గారు వాళ్ల సినిమా ప్రమోషన్స్ కి నావంతు సహాకారం అందిస్తాను అని వచ్చారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ అన్నారు.
డైరెక్టర్ అరుణ్ పావర్ మాట్లాడుతూ... త్రివిక్రమ్ గారి వెనక నడుస్తూనే ఎన్నో నేర్చుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఈ చిత్ర నిర్మాతకు రుణపడి ఉంటనాను. ఆయన్ని లైఫ్ లో ఎప్పటికీ మరచిపోలేను. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ అందిస్తున్న సప్తగిరికి థ్యాంక్స్. గౌతంరాజు గారు తన కెరీర్ లో 91 డైరెక్టర్ నువ్వు అన్నారు. నిజంగా సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గారు నా సినిమాకి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మనిషిని చూసి దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాను. జనాల కోసం కష్టపడే దేవుడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఆడియో ఫంక్షన్ కి కళ్యాణ్ గారు రావడం మా అదృష్టం. టీమ్ అంతా రుణపడి ఉంటాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్ గానిన్ మాట్లాడుతూ... సప్తగిరి ఈ సినిమా ద్వారా నాకు అవకాశం ఇవ్వడం కాదు అన్నమే పెట్టాడు. ఈ పాటలు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. కళ్యాణ్ గారి సమక్షంలో నా పాటలు రిలీజ్ కావడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరోయిన్ రోషిని ప్రభాకర్ మాట్లాడుతూ... సప్తగిరి ఎక్స్ ప్రెస్ నా ఫస్ట్ ఫిల్మ్. నాకు అవకాశం ఇచ్చిన హీరో సప్తగిరి, డైరెక్టర్ అరుణ్ పావర్ కి థ్యాంక్స్. ఈ ఫంక్షన్ కి వచ్చిన పవర్ స్టార్ కి థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ... నేను ఇంటర్ నుంచి పవన్ కళ్యాణ్ గార్ని చూస్తున్నాను. చెప్పడం వేరు చేయడం వేరు. మహా మనిషి ఆయన. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తను అనుకున్నది చేస్తారు. పది మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సినిమా విషయానికి వస్తే... ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఫాదర్ సన్ రిలేషన్ ఆడియోన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ... మెగా అభిమానుల మధ్య ఒక మోగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అని జీవితంలో ఊహించలేదు. పుట్టినప్పటి నుంచి చిరంజీవి గార్ని చూస్తూ.. ఆరాధ్యిస్తూ.. పెరిగాను. నేను నిజాయితీ అభిమాని కాబట్టే పవర్ స్టార్ ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఆయన్ని చూస్తుంటే ఒకసారి చిన్నపిల్లాడిలా కనిపిస్తారు. ఒకసారి యోగిలా కనిపిస్తారు. చరిత్ర సృష్టించే వ్యక్తి అని బుక్ లో చదవడమే..కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాం. భవిష్యత్ లో చరిత్ర సృష్టించే వ్యక్తి వెనక నిలబడి ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిన్న సినిమాని తన రాకతో పెద్ద సినిమా చేసిన పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. కళ్యాణ్ గారి కోసం ఎంత దూరం రావడానికైనా..ఏం చేయడానికైనా సిద్దం అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం నాకు అలవాటు లేదు. కానీ అభిమానుల ప్రేమకు స్పందిస్తాను అందుకే ఈ ఫంక్షన్ కి వచ్చాను. సప్తగిరి గబ్బర్ సింగ్ లో ఒక సీన్లో నటించాడు. అతను నటించింది ఒక సీన్లోనే అయినా నాకు విపరీతంగా నచ్చింది. ఆతర్వాత సప్తగిరి గార్ని కలవాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ఈవిధంగా ఆయన్ని కలుసుకునే అవకాశం వచ్చింది. శరత్ మరార్ తో చేస్తున్న సినిమాకి టైటిల్ కాటమరాయుడు అని చెబితే బాగుంది అని చెప్పాను. అయితే ఈ టైటిల్ సప్తగిరి సినిమాకి పెట్టుకున్నారట. అప్పుడు నాకు తెలియదు. 70 శాతం షూటింగ్ అయిపోయినా సరే...మేము వద్దన్నా టైటిల్ ఇచ్చినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నేను సినిమాల్లో నటిస్తాను కానీ చూడడం తక్కువ. నేను నటించిన సినిమాల్లో రెండు సినిమాలు చూడలేదు. కానీ సప్తగిరి సినిమా చూడాలి అనిపిస్తుంది. ఆయన చూపించే ఎనర్జి చూస్తుంటే ఖచ్చితంగా షో వేయించుకుని చూస్తాను. అరుణ్ పవర్ నా మిత్రుడు త్రివిక్రమ్ కి కావలసిన వ్యక్తి. తను ఈ మూవీకి డైరెక్టర్ అని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఈచిత్రానికి సంగీతం అందించిన విజయ్ బులుగానిన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అనిపిస్తుంది. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను.అందరికీ ఆనందం కలిగించాలి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments