ఆంధ్రా అంటే కులం కాదు - పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నోటుకి వోటు కేసుకి సంబంధించి తన గళాన్ని ఈరోజు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామలపై కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తాను ప్రస్తుత రాజకీయాలపై ప్రతిస్పందిస్తానని తెలియజేశారు. అన్నట్లుగానే ఈరోజు పవన్ స్పందనను తెలియజేశారు. ఆంధ్రా అంటే కులం కాదు, కేవలం ఒక చంద్రబాబు ఒక్కరే కాదు, చాలా మంది తెలుగు ప్రజలది.
అందులో చాలా మంది కులాలు, మతాలు ఉన్నాయి. తిడితే చంద్రబాబు, నన్ను కానీ తిట్టుకోండి అంతే కానీ జనాల్ని తిట్టవద్దు. రాజకీయ నాయకులు వారి వ్యాపారాలను రక్షించుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే.
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడగాలి. కేంద్రం కుదరదంటే ఏం చేస్తారో చెప్పమనాలి. అలా చేయకుంటే తెలంగాణా రాజకీయ నాయకుల కంటే ఆంధ్రా పాలకులే ప్రజలకు అన్యాయం చేసివాళ్లవుతారు. మీకు కేంద్రం దగ్గరకు వెళ్లడానికి భయంగా ఉంటే రాజకీయాలను విడిచిపెట్టేయండంటూ పవన్ ఘాటుగానే స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout