మీడియాకు సారీ చెప్పిన సర్ధార్
- IndiaGlitz, [Saturday,October 17 2015]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నానక్ రామ్ గూడలో జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్ధాపనకు రావల్సిందిగా ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు సర్ధార్ షూటింగ్ స్పాట్ కు వెళ్లారట.
ఈ విషయాన్ని తెలుసుకుని న్యూస్ ఛానల్స్, వార్తపత్రికల ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారట. అయితే పవన్ వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులను అడ్డుకోవడం..ఆతర్వాత మీడియా ప్రతినిధులపై దాడి చేయడం జరిగిందట. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ మీడియా ప్రతినిధులకు సారీ..చెప్పడంతో గొడవ సద్ధుమణిగిందట. అయితే అమరావతి శంకుస్ధాపనకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు మాత్రం...ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని...అమరావతి శంకుస్ధాపనకు వచ్చేది లేనిది త్వరలో తెలియచేస్తానన్నారట పవన్.