ఒలంపిక్ మెడల్ తో హాకీకి పునర్వైభవం: పవన్ కళ్యాణ్
- IndiaGlitz, [Thursday,August 05 2021]
భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో పతకం సాధించి జాతీయ జెండా రెపరెపలాడేలా చేసింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో భారత జట్టు చిరస్మరణీయ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా.. భారత్ కు కాంస్య పతకాన్ని అందించింది.
ఇదీ చదవండి: 'యమదొంగ'లా సన్నగా అయిపోతాడా ?
టోక్యో ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు విజయం సాధించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించారు. 'మన్ ప్రీత్ సింగ్ సారధ్యంలోని హాకీ జట్టుకి నా తరపున, జనసేన పార్టీ తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కాంస్య పోరులో జర్మనీ లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్నా ఆత్మస్థైర్యంతో పోరాడి గెలిచారు.
ఒలంపిక్ పతకంతో మనదేశంలో హాకీ క్రీడకు పూర్వ వైభవం రానుంది. టోక్యో ఒలంపిక్స్ తో భారత క్రీడాకారులు సాధిస్తున్న పతకాలు ఆశాజనకంగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను, షటిల్ లో పివి సింధు, బాక్సింగ్ లో లవ్లీనా, ఇప్పుడు పురుషుల హాకీ జట్టు పతకాలు సాధించారు. ఇది శుభపరిణామం. రెజ్లర్ రవి ఫైనల్ కు చేరుకొని ఇండియాకు మరో మెడల్ ఖరారు చేశారు. ఆయన స్వర్ణం సాధించాలని కోరుతున్నా. అలాగే మహిళల హాకీ జట్టు కూడా కాంస్య పోరులో విజయం సాధించాలి' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
1980 మాస్కో ఒలంపిక్స్ తర్వాత భారత హాకీ జట్టు ఒలంపిక్స్ లో పతకం సాధించడం ఇదే తొలిసారి. దీనితో ఇండియాలో హాకీ మళ్ళీ ప్రాధాన్యత పెరుగుతుంది అని పలువురు క్రీడాకారులు అభిప్రాయ పడుతున్నారు.
ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు పునర్ వైభవం - JanaSena Chief Shri @PawanKalyan #Tokyo2020 #Olympics #FieldHockey pic.twitter.com/phvd0YCSrQ
— JanaSena Party (@JanaSenaParty) August 5, 2021