జనసేన భజన సేన కాదు...తెలుగు రాష్ట్రాల ప్రజలకు భజన సేన - పవన్
- IndiaGlitz, [Saturday,August 27 2016]
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి తుడా ఇందరా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...నాకు సినిమాలంటే వ్యామోయం లేదు. వర్తమాన రాజకీయాలు యువతకు మేలు చేయకపోతే బాధగా ఉంటుంది. సినిమాలో చాలా అద్భుతాలు చెప్పవచ్చు. ఆస్తులు దానం చేయచ్చు. రౌడీలను విలన్ ను కొట్టేయచ్చు. హీరోయిన్స్ తో పాటలు పాడచ్చు ఇదంతా రెండున్నర గంట్లో చేసేయచ్చు. అయితే....అసలైన సమస్యలకు పరిష్కారాలు దొరకాలంటే...కష్టపడాలి.. త్యాగాలు చేయాలి. ఈ రోజు మూడు విషయాలు గురించి మాట్లాడతాను.
జనసేన పార్టీ ఆవిష్కరణ తర్వాత నేను ఎదుర్కొన్న విషయాలు గురించి... తెలుగుదేశం పనితీరు గురించి....అడ్డగోలుగా విడగొట్టి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ గురించి మాట్లాడతాను. సభను తిరుపతిలోనే పెట్టి ఎందుకు మాట్టాడాలి అంటే...మోడీ, చంద్రబాబులతో కలిసి ఫస్ట్ మీటింగ్ పెట్టింది తిరుపతిలోనే. అందుకే ఇక్కడ మాట్టాడాలని నిర్ణయించుకున్నాను. నాకు అందరి సహాయ సకారాలు కావాలి. ప్రజల సమస్యలు గురించి పోరాటం చేస్తాను. రాష్ట్రం విడిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసాను..! ఇప్పుడు ఇరాటం పెట్టే విమర్శలు చేయను. అయితే... ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మోడీ భజన చేయడానికి జనసేన పెట్టాడు అన్నారు. తెలుగుదేశం తొత్తు అని తిట్టారు. గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అన్నారు. తిట్టండి కానీ నేను ప్రజలకు చేయాల్సింది. యువతకు చేయాల్సింది చాలా ఉంది. నేను ఎక్కడికి పారిపోను. నా రాష్ట్రం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. మాట తప్పే మనిషిని కాదు మడంతిప్పే మనిషిని కాదు. జనసేన భజన సేన భజనసేన అంటున్నారుకరెక్టే. తెలుగు రాష్ట్రల ప్రజలకు భజన సేన. మానవత్వం కోసం పోరాటం చేసే వాళ్లు నిజమైన హీరోలు అన్నారు.