ఉచిత విద్య, వైద్యం అందిస్తాం: పవన్

  • IndiaGlitz, [Friday,March 29 2019]

జ‌న‌సేన ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత నంద్యాల పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక జిల్లా అయితే గానీ నంద్యాల అభివృద్ది సాధ్యప‌డ‌ద‌ని జనసేనాని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా శుక్రవారం క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ... రాయ‌ల‌సీమ‌లో మార్పు వచ్చి అభివృద్ధి కావాలి అంటే జ‌న‌సేన రావాలనీ, డ‌బ్బుతో సంబంధం లేని, బాధ్యత‌తో కూడిన రాజ‌కీయ వ్యవ‌స్థను తీర్చిదిద్దుతామ‌న్నారు.

విద్య, వైద్యం...

మండుటెండ‌లో మ‌ల‌మ‌ల మాడుతూ నా కోసం వ‌చ్చిన మీ జీవితాల్లో వెన్నెల కురిపించేందుకే జ‌న‌సేన పార్టీ పెట్టాను. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లో కుందూ న‌దిపై వంతెన నిర్మాణం చేప‌డ‌తాం. నంద్యాల ప్రభుత్వ ఆసుప‌త్రిలో క‌నీస వైద్య ప‌రిక‌రాలు అందుబాటులో లేవు. వైద్యులు అందుబాటులో లేరు. జ‌న‌సేన ప్రభుత్వంలో వైద్యుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు వారు నివాసం ఉండేందుకు స‌క‌ల సౌక‌ర్యాల‌తో వ‌స‌తులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో కార్పొరేట్ ఆసుప‌త్రుల‌తో స‌మంగా వ‌స‌తులు క‌ల్పిస్తాం. ప్రభుత్వ ఆసుప‌త్రుల్ని బ‌లోపేతం చేస్తాం. విద్యార్ధుల సౌక‌ర్యార్థం ప్రతి మండ‌లానికి ఒక డిగ్రీ క‌ళాశాల ఏర్పాటు చేస్తాం. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందిస్తాం. జ‌న‌సేన ప్రభుత్వంలో విద్యార్ధుల‌కు ఉచిత బ‌స్సు, రైల్వే పాసుల‌తో పాటు ప్రతి ప్రభుత్వ కళాశాల‌లో ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అని పవన్ చెప్పుకొచ్చారు.

రెడ్డిని పార్లమెంట్‌కు పంపండి!

విజ‌య‌వాడ‌-నంద్యాల మ‌ధ్య ఒక రైలు కావాల‌న్నది ఈ ప్రాంతం వాసుల క‌ల‌, ఆ క‌ల సాకారం కావాలి అన్నా, ఏపీ ఎక్స్‌ప్రెస్ రాయ‌ల‌సీమ‌లో ఆగాల‌న్నా పార్లమెంటులో మ‌న త‌రఫున పోరాటం చేసే ఎస్పీవై రెడ్డి లాంటి వ్యక్తులు రావాలి. ఆడ‌ప‌డుచుల కోసం ఆదాయంతో సంబంధం లేకుండా కుటుంబ స‌భ్యల సంఖ్య ఆధారంగా ఏడాదికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండ‌ర్లు జ‌న‌సేన ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. రేష‌న్‌కి బ‌దులుగా నెల‌కి రూ. 2500 నుంచి రూ. 3500 వ‌ర‌కు మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ‌చేస్తాం. ప్రతి కుటుంబానికి ప‌ది ల‌క్షల రూపాయిల ఆరోగ్య భీమా క‌ల్పిస్తాం. రోడ్ల ప‌క్కన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల‌కు రూ. 5000 నుంచి రూ. 10 వేల వ‌ర‌కు ఎలాంటి పూచీక‌త్తు లేకుండా పావ‌లా వ‌డ్డీ రుణాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశ ప‌రీక్షల‌కి ఏడాదికి ఒక్కసారి ఫీజు చెల్లిస్తే అది అన్నింటికీ వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకు అవ‌రోధాలు క‌ల్పించే ప‌రిస్థితులు రాయ‌ల‌సీమ‌లో ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్ని రూపుమాపేందుకు జ‌న‌సేన పార్టీకి బ‌లాన్ని ఇవ్వండి అని పవన్ కల్యాణ్ నంద్యాల ఓటర్లను అభ్యర్థించారు.

More News

కరవు సీమ కాదు.. కల్పతరువు సీమగా చేస్తా!

రాయ‌ల‌సీమ‌ క‌రవు సీమగా కాదు, క‌ల్పత‌రువు సీమ‌గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ సీమ ప్రజలకు హామీ ఇచ్చారు.

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా..

"నా ఇంటి పేరైన గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మా ఇంటి పేరుతో కొణిద‌ల గ్రామం ఉంది.

'ఇది నా సెల్ఫీ' చిత్రం.. సెల్ఫీ కాంటెస్ట్ తో బహుమతులు... !!

వినోద్‌, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్) స్వీయ దర్శకత్వంలో

'శివ' తో సైకిల్ చైన్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ఏకంగా..!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

'ఒ.జి.య‌ఫ్‌'లో బ్యాడ్‌బాయ్ మ‌నోజ్ నందం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ

'అతడు'లో కథానాయకుడి చిన్నప్పటి పాత్రలో జూనియర్ మహేష్ బాబుగా, 'ఛత్రపతి'లో జూనియర్ ప్ర‌భాస్‌గా మెప్పించారు మనోజ్ నందం. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.