రాజధానిపై మోదీని కలుస్తా.. పవన్ వార్నింగ్!
- IndiaGlitz, [Friday,August 30 2019]
ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కురగల్లు గ్రామస్తులతో జనసేనాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? క్లారిటీ ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు. రాజధానిని పొలిటికల్ గేమ్‌గా చూడొద్దని.. రాజధానిని తరలించడానికి జనసేన ఒప్పుకోదని చెప్పుకొచ్చారు. రాజధానిపై ప్రకటన చేసేముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని బొత్సకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు.
మోదీని కలుస్తా..!
రాజధాని భూముల విషయంలో నిజంగానే అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్ర సమస్యలను వారికి క్షుణ్ణంగా వివరిస్తానని జనసేనాని ఈ సందర్భంగా పవన్ ఒకింత వార్నింగ్ ఇచ్చారు..