పదవి కోసమే పార్టీ పెట్టాలా.. స్టార్‌డమ్ చాలదా!?

  • IndiaGlitz, [Tuesday,July 30 2019]

పదవుల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, జాతీయస్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు, స్టార్ డమ్ ఉపయోగించుకుంటే చాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. భావితరాల భవిష్యత్తు కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. డబ్బు, పేరు కోసం ఏనాడూ పాకులాడలేదని, మానవత్వం చచ్చిపోకూడదని మాత్రమే తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. జనసేన పార్టీ డబ్బు బలంతో పుట్టిన పార్టీ కాదని, అభిమానం, ఆశయ బలంతో స్థాపించినది అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, ఓటమి నుంచి జనసేన పార్టీ శిల్పాకృతి తీసుకుంటుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులు, జనసైనికులతో.. పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గెలుపులో ఎవరు మనవాళ్లో, ఎవరు పరాయివాళ్లో తెలియదు కానీ, ఓటమిలో మాత్రం మనవాళ్లు ఎవరో కచ్చితంగా తెలుస్తుందన్నారు.

మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చాను. .!

ఎన్నికల్లో గెలిచిన పార్టీ మీటింగ్ పెట్టినా ఇంతమంది రారేమో. పార్టీ గెలుపులో కాదు, ఓటమిలో కలుసుకున్నాం... మీరంతా నా ఆత్మబంధువులు. నా కుటుంబానికి అన్యాయం జరిగితే రాజకీయాల్లోకి రాలేదు. అన్యాయానికి గురవుతున్న విద్యార్ధులు, ఆడపడుచుల ఆవేదన, ప్రభుత్వాల తప్పుడు విధానాలు చూసి మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చాను. పక్కనే గోదావరి పారుతున్నా ఉభయగోదావరి జిల్లాల్లో తాగటానికి నీళ్లు లేవు. వాటర్ బాటిళ్లు కొనుక్కోవలసిన దుస్థితి నెలకొంది. ఇదే కొనసాగితే 25 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి..?. ఇలాంటి ఆవేదనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. నా పోరాటం ఈతరం కోసం కాదు... రాబోయే తరాల కోసం. 25 ఏళ్లు పోరాటం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ఒక్క ఓటమి కుంగదీస్తుందా..?, ఒక్క అపజయం వెనకడుగు వేసేలా చేస్తుందా..?. ఓటమి ఎదురైతే మరో పది అడుగులు ముందుకు బలంగా వేస్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఓడిపోవటానికైనా సిద్ధమే కానీ విలువలు చంపుకోవటానికి మాత్రం సిద్ధంగా లేను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

లోపాయికారి ఒప్పందమా..?

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటే అపేదెవరు..?. 2018 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సం నాడు ఓ నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ఒక ఆశయానికి కట్టుబడి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశాం అని పవన్ చెప్పుకొచ్చారు.

తిట్టు భరించడం సరదా కాదు!

అది ఎవరన్నా నమ్మకపోతే అది వాళ్ల సమస్య తప్ప నాది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల మీద నిర్భయంగా మాట్లాడగలిగినప్పుడు .. మాటమీద నిలబడే నేను దానికి పదింతలు ధైర్యంగా మాట్లాడగలను. రాజకీయాలు వ్యాపార ధోరణిలోకి వెళ్లిపోయిన ఈ పరిస్థితుల్లో... మళ్లీ ఆశయాల సాధన కోసం ఒక రోజు వస్తుంది. ఆ రోజు వ్యక్తులు కావాలని వెతుకుతారు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాను. లక్షలాది మందితో చప్పట్లు కొట్టించుకునే స్థితిలో ఉండి కూడా నెలల తరబడి టీవీల్లో తిడుతుంటే భరించడం సరదా కాదు. ఆశయసాధన కోసం నిలబడగలనా లేదా అని పరీక్షించుకున్నాను. విమర్శకు, అపజయానికి కుంగిపోయేవాడిని కాదు. ఆశయం కోసం పని చేసేటప్పుడు ప్రాణాలు పోవాలి తప్ప వెనక్కిమాత్రం తిరిగి చూడను.

నాకు క్లారిటీ లేక కాదు!

సమాజం మీద ప్రేమ, బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలతో వ్యాపారం చేయడానికి కాదు. నా ఆశయం కోసం పార్టీ పెట్టాను. 45 రోజుల ముందు పెట్టాల్సిన ఈ సమావేశం ఎందుకు ఆలస్యం చేశానంటే నాకు క్లారిటీ లేకకాదు. నా చుట్టుపక్కల ఉన్నవారికి క్లారిటీ లేక.. క్షేత్ర స్థాయిలో యువత, ఆడపడుచులు నన్ను అర్ధం చేసుకున్నారు. కానీ నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తున్నారు. అది నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. పార్టీ నిర్మాణం, కమిటీలు వేయకపోవడానికి కారణం కూడా నన్ను అర్ధం చేసుకునే వ్యక్తుల కోసం ఎదురు చూశాను తప్ప చేతకాక కాదు. చాలా వరకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులనే నియోజకవర్గ ఇంఛార్జులుగా నియమిస్తాం అని జనసేనాని తెలిపారు.

More News

ఆక‌ట్టుకుంటున్న'సాహో ' సాప్ట్ మెలోడీ సాంగ్ ఏ చోటా నువ్వున్నా

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకం పై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో.

వ‌ద్ద‌నుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌

`ల‌క్ష్మీ క‌ల్యాణం`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కాజ‌ల్.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

బ‌న్నీ సినిమా నుండి వెళ్లిపోయిన రావు ర‌మేశ్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

'నేను లేను' సక్సెస్ మీట్

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మాతగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`...

ప్రముఖ దర్శకులు విఎన్.ఆదిత్య, అమ్మ రాజశేఖర్ చేతుల మీదుగా 'సర్వం సిద్ధం' టీజర్ విడుదల

సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత బి వెంకట్ నిర్మిస్తున్న "సర్వం సిద్దం - నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత" శరవేగంగా చిత్ర నిర్మాణం జరుపుకొంటోంది.