జగన్ అంటే వ్యక్తిగతంగా కోపాల్లేవ్..: పవన్

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా కోపాల్లేవ్.. కక్షల్లేవ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున భీమవరం బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ..నాకు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీద వ్యక్తిగ‌త కోపాలు.. క‌క్షలు లేవు. ఆయన అనుస‌రిస్తున్న విధానానికే వ్యతిరేకిని.

నేను రాజ‌కీయాల్లోకి రాక ముందు 2006లో అన్నవ‌రం షూటింగ్‌లో ఓ వ్యక్తి నా గ‌దిలోకి దూసుకువ‌చ్చి సినిమా చేయాలి అని అడిగిన‌ప్పుడు. ఇన్ని ల‌క్షల మంది అభిమానం చూరగొన్న నా ప‌రిస్థితే ఇలా వుంటే సామాన్యుల ప‌రిస్థితి ఏంటి అన్న ఆలోచ‌న క‌లిగింది. మీకు రాజ‌కీయ నేప‌ధ్యం ఉండొచ్చు. మీరు ఏ ప‌ద‌విలో అయినా ఉండొచ్చు. అయితే మీ జులుం బ‌య‌టికి తీసుకురావ‌ద్దు. ఇంద్ర సినిమాలో చెప్పిన విధంగా పీక‌లు అయితే కోయ‌లేంగానీ, నిజ‌ జీవితంలో ఓటు అనే ఆయుధంతో త‌రిమేస్తాం. మీలో ధైర్యం ఉంటే ఎవ్వరూ భ‌య‌పెట్టలేరు అని పవన్ సినిమా డైలాగులు కురిపించారు.

More News

టీడీపీకి ఓటేయండి..: హీరోయిన్ సమంత

ఇదేంటి టైటిల్ చూడగానే షాకయ్యారా..? అవును మీరు వింటున్నది నిజమే. అదేంటి అక్కినేని ఫ్యామిలీ వైసీపీలో ఉందిగా మళ్లీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటని అనుకుంటున్నారేమో..

57 బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలుకుని నేటి వరకూ ప్రధాన పార్టీల అధినేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలారు.

రాబోయేది జనసేన ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని అంతా గుర్తుపెట్టుకోండని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.

అసెంబ్లీలో అడుగుపెడతా.. యువతకు పోలీస్ ఉద్యోగాలిస్తా!

రాజకీయాలకు కావాల్సింది వేలకోట్లు డబ్బు కాదని.. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే భావజాలం, మార్పు తీసుకురావాలన్న తపన, ప్రత్యర్ధులను ఎదుర్కొనే గుండె ధైర్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏపీలో మూగబోయిన ఎన్నికల మైక్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని నేటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలకు ముగిసింది.