చిరంజీవి గారు...పవన్ రారు..!

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను ఈరోజు ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసారు. సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగే ఈ భారీ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తాడు అనుకున్నారు. కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌డం లేదు అని స‌మాచారం. మెగా హీరోలు అంద‌రూ హాజ‌ర‌వుతున్న ఈ వేడుకకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతారు అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. అయితే...కాట‌మ‌రాయుడు షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ప‌వ‌న్ ఈ వేడుక‌కు హాజ‌రు కావ‌డం లేదు అని ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రి...ఈ వేడుక‌లో చిరు ఏం మాట్లాడ‌తారో...? ముఖ్యంగా ప‌వ‌న్ రాక పోవ‌డం గురించి ఏం చెబుతారో..? అభిమానుల ఎలా స్పందిస్తారో అనేది ఆస‌క్తిగా మారింది.