ఆంధ్రులు మీ బానిసలు అని పొరబడద్దు - పవన్ కళ్యాణ్..!

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ యువ‌త‌కు పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు ఏపీ యూత్ రెడీ అవుతుంది. నిన్న‌దేశ్ బ‌చావో అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ రిలీజ్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఆంధ్రులు ఈ దేశ ప్ర‌జ‌లు కేంద్రంలో ఉండే నాయ‌కుల‌కు పార్టీల‌కు బానిస‌లు కారు. ప‌ద‌వులు కోరుకునే వారు, వ్య‌క్తిగ‌త లాభం ఆశించే వారు, వ్యాపార అవ‌స‌రాలు ఉన్న వ్య‌క్తులు, నాయ‌కులు మీకు జిహుజూర్ అని వంగి వంగి స‌లాములు చేయ‌డం చూసి ఆంధ్రులు మీ బానిస‌లు అని పొర‌బ‌డ‌ద్దు అని తెలియ‌చేసారు.