ఫ్యాన్స్ పాస్ ఉంటే రండి..పాస్ లేకపోతే రావద్దు - పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్ నోవాటెల్ లో సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ...సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ చేయాలా..? వద్దా..? అనుకున్నాను. గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ టైం లో జరిగిన సంఘనలు దృష్ట్యా పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు. ఆడియో ఫంక్షన్ కి వచ్చే అభిమానులు, అతిధులుకి ఇబ్బందులు ఎదురైతే నేను ఇబ్బందిగా ఫీలవుతాను.
అయితే.. నిర్మాత శరత్ మరార్ పోలీసులను కలసి ఆడియో ఫంక్షన్ కి చేస్తున్న పకడ్బందీ ఏర్పాట్లు గురించి చెప్పారు. అందుచేత పాస్ లు ఉన్నవారు మాత్రమే ఆడియో ఫంక్షన్ కి రండి. పాస్ లు రానివారు రావద్దు. ఇంటి దగ్గరే ఉండి టి.వీలో చూడండి. ఇది నా విన్నపం. పాస్ లు లేనివారు కూడా ఇక్కడకు రావడం వలన అసాంఘిక శక్తులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆడియో ఫంక్షన్ కి అన్నివిధాల సహకరిస్తున్న పోలీస్ డిపార్టెమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
అలాగే కె.టి.ఆర్, హరీష్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.ఈ ఆడియో ఫంక్షన్ కి అన్నయ్య చిరంజీవి గారు ముఖ్యఅతిథిగా వస్తున్నారు. అలాగే సర్ధార్ సెట్స్ కి కూడా అన్నయ్య వచ్చి కలిసారు. సరదాగా మాట్లాడుకున్నాం. సర్ధార్ సినిమా కథ అలాంటిది కాబట్టే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఖుషీ తర్వాత నా లుగైదు హిట్స్ వస్తే..సినిమాల్లో నటించడం మానేయవచ్చు అనుకున్నాను. కానీ రాలేదు.ఇక డైరెక్షన్ చేయదలచుకోలేదు. రామ్ గోపాల్ వర్మ గారు నా గురించి ట్వీట్స్ చేస్తుంటారు. నేను చూస్తుంటాను. ఆయనను నేను గౌరవిస్తాను. సర్ధార్ గబ్బర్ సింగ్ ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments