పవన్ కళ్యాణ్ కిది ఆరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగేళ్ల క్రితం 'గబ్బర్‌సింగ్'గా వేసవికి సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ ఈ వేసవికి 'సర్దార్ గబ్బర్‌సింగ్' గా వినోదాన్ని పంచడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తనే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు.. సినిమాని దగ్గరుండి మరీ అందంగా తీర్చిదిద్దుతున్నారు పవన్. ఇదిలా ఉంటే.. 'సర్దార్' ఏప్రిల్ 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇలా ఏప్రిల్ నెలలో పవన్ సినిమా రావడం ఇది ఆరోసారి.
2000లో బద్రి, 2001లో ఖుషి, 2003లో జానీ.. అంటూ తన వరుస 3 చిత్రాలను ఏప్రిల్‌లోనే అభిమానుల ముందుకు తీసుకువచ్చిన పవన్.. ఆ తరువాత 2008లో జల్సా, 2011లో తీన్ మార్ చిత్రాలను కూడా ఏప్రిల్‌లోనే వినోదాన్ని పంచేందుకు టార్గెట్‌గా చేసుకున్నారు. మళ్లీ 5 ఏళ్ల తరువాత అదే ఏప్రిల్‌లో ఇప్పుడు 'సర్దార్ గబ్బర్‌సింగ్'గా అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన 5 సినిమాల్లో మూడు విజయాలు సాధించిన వైనం చూస్తే.. సర్దార్ కి ఏప్రిల్ సెంటిమెంట్ బలంగా ఉందనే చెప్పాలి. పవన్‌కి కథానాయకుడుగా 21వ చిత్రంగా.. నటుడుగా 23వ చిత్రంగా వస్తున్న 'సర్దార్' పై భారీ అంచనాలే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com