పవర్ స్టార్ ని ప్రేమిస్తున్న హీరోయిన్..
Saturday, March 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు...అందాల తార సమంత. ఇంతకీ విషయం ఏమిటంటే...పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో పవన్ చెక్క గుర్రం పై కూర్చొని ఆడుకుంటున్నట్టు ఓ సీన్ ఉంది.
అచ్చంగా అలాగే ఓ చెక్క గుర్రం పై కూర్చొని పవన్ వీరాభిమాని హీరో నితిన్ కూడా ఆడుకుంటున్నాడు. అయితే చెక్క గుర్రం పై నితిన్ ని ఆటాడిస్తుంది హీరోయిన్ సమంత. ఇదంతా అ ఆ సినిమా సెట్స్ లో జరిగింది. ఇలా చెక్క గుర్రం పై ఆడుకుంటూ నితిన్ - సమంత ఇద్దరూ వి లవ్ పవన్ కళ్యాణ్ అంటూ పవన్ పై వీరికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అ ఆ సెట్లో జరిగిన చెక్క గుర్రం ఆటను వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు పవన్ వీరాభిమాని నితిన్. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments