తెలంగాణ ప్రభుత్వానికి పవన్ విన్నపం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఓ విన్నపం చేశాడు. ఇంతకు ఆయన విన్నపం చేయడానికి కారణమెవరో తెలుసా?.. సినీ కార్మికులు. చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం స్థలం కేటాయించాలని .. తద్వారా 30 వేల మంది కార్మికులకు నివాసం కల్పించిన వారవుతారని ఆయన తెలిపారు. వీలైతే జనసేన పార్టీ తరపున కూడా వినతి పత్రాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు, ఇతర కార్య వర్గ సభ్యులతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం ఇళ్లు లేని కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించారు.
``చిత్ర పరిశ్రమ ఎన్నో వేల మందికి జీవనోపాధిని అందిస్తుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతో సినీ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. చాలా పెద్ద పరిశ్రమగా ఎదిగింది. దాదాపు 35 వేల మంది కార్మికులు సినీ పరిశ్రమలో ఉన్నారు. అందరికీ ప్రభుత్వం ఇచ్చిన భూమి సరిపోవడం లేదు. కాబట్టి మరికొంత స్థలాన్ని కేటాయించాలి. చిత్రపురి ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలి`` అని పవన్‌కల్యాణ్ అన్నారు.
``4 వేల మందికి సరిపడే స్థలాన్ని 40 వేల మందికి సర్దడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం మరో 9 ఎకరాల భూమిని కేటాయించాలని కోరాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. పవన్‌కల్యాణ్ కూడా ప్రభుత్వం తరపున విన్నవిస్తే మరికొంత మందికి మేలు జరుగుతుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout