తెలంగాణ ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ విన్న‌పం

  • IndiaGlitz, [Wednesday,September 11 2019]

తెలంగాణ ప్ర‌భుత్వానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ విన్న‌పం చేశాడు. ఇంత‌కు ఆయ‌న విన్న‌పం చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రో తెలుసా?.. సినీ కార్మికులు. చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని సినీ కార్మికుల కోసం స్థ‌లం కేటాయించాల‌ని .. త‌ద్వారా 30 వేల మంది కార్మికులకు నివాసం క‌ల్పించిన వార‌వుతార‌ని ఆయ‌న తెలిపారు. వీలైతే జ‌న‌సేన పార్టీ త‌ర‌పున కూడా విన‌తి ప‌త్రాన్ని అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. తెలుగు సినీ వ‌ర్క‌ర్స్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సోసైటీ అధ్య‌క్షుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇత‌ర కార్య వ‌ర్గ స‌భ్యుల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఇళ్లు లేని కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి విన్న‌వించారు.

''చిత్ర ప‌రిశ్ర‌మ ఎన్నో వేల మందికి జీవ‌నోపాధిని అందిస్తుంది. ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా ఎంతో సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి బ్ర‌తుకుతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత చాలా మార్పులు జ‌రిగాయి. చాలా పెద్ద ప‌రిశ్ర‌మ‌గా ఎదిగింది. దాదాపు 35 వేల మంది కార్మికులు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. అంద‌రికీ ప్ర‌భుత్వం ఇచ్చిన భూమి స‌రిపోవ‌డం లేదు. కాబ‌ట్టి మ‌రికొంత స్థ‌లాన్ని కేటాయించాలి. చిత్ర‌పురి ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి'' అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

''4 వేల మందికి స‌రిప‌డే స్థ‌లాన్ని 40 వేల మందికి స‌ర్ద‌డం చాలా క‌ష్టం. కాబ‌ట్టి ప్ర‌భుత్వం మ‌రో 9 ఎక‌రాల భూమిని కేటాయించాలని కోరాం. ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ప్ర‌భుత్వం త‌ర‌పున విన్న‌విస్తే మ‌రికొంత మందికి మేలు జరుగుతుంది'' అన్నారు.

More News

'నాని'స్‌ గ్యాంగ్‌లీడర్‌' సెప్టెంబర్‌ 13న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది - నాని

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై

కేటీఆర్‌కు ప్ర‌భాస్ మ‌ద్దతు

`బాహుబ‌లి`, `సాహో` చిత్రాల‌తో ఇండియా అంత‌టా సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తెలంగాణ మినిష్ట‌ర్ కేటీఆర్‌కు మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు.

కుల వివాదంపై లావ‌ణ్య త్రిపాఠి కౌంట‌ర్ ట్వీట్‌.. తొల‌గింపు

స‌మ స‌మాజంలో కుల మ‌తాల‌కు చోటు ఉండ‌కూడుదు. ప్ర‌స్తుత నాగ‌రికత స‌మాజంలో కుల మ‌తాల మ‌ధ్య అంత‌రం త‌గ్గుతుంది.

పులితో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫైట్‌?

`బాహుబ‌లి` త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`.

సైరాతో కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఆయ‌న న‌టిస్తోన్న 151వ చిత్ర‌మిది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.