వెనక్కి లాగే వ్యాఖ్యలు చేయకండి - పవన్ కళ్యాణ్..!
- IndiaGlitz, [Wednesday,January 25 2017]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా కోసం యువతకు పిలుపు నివ్వటంతో ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. అయితే...జల్లికట్టు కోసం తమిళనాడు యువత చేసిన పోరాట స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సి రావడం బాధాకరం అనేది కొంత మంది వాదన.
ఇలాంటి వాదనలకు సమాధానంగా పవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ...తమిళులు సాంప్రదాయం కోసం అంత పోరాటం చేస్తున్నప్పుడు మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చేయాలి. యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే సహకరించండి..అంతే కానీ వెనక్కి లాగే వ్యాఖ్యలు చేయకండి. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న సామెత లాగా ఏపీ ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు చేసే వారిని చెయ్యనివ్వరు మరి..ఎలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా యువత చెయ్యాలనుకుంటున్న ఏపీ ప్రత్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరు కార్చినా వారు ఏపీ రాష్ట్ర యువత భవిష్యత్తుని నాశనం చెయ్యటమే అని ట్వీట్ చేసారు.