ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలి: పవన్
- IndiaGlitz, [Sunday,July 05 2020]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జన్మించిన గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని.. ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని పవన్ కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘అణగారిన వర్గాల్లో ధైర్యాన్ని నింపి బ్రిటిష్ పాలకులపై పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు వంటి మహా యోధుడిని తెలుగు నేల ఎప్పటికీ మరచిపోదు.
మన్యం ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వేధింపుల నుంచి విముక్తుల్ని చేసేందుకు ఆయన నాటి పాలకులపై చేసిన యుద్ధం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన చేసిన పోరాటాన్ని కొందరు నాయకులు, వార్తా పత్రికలు ప్రశంసించనప్పటికీ.. ఆయన వేసిన మార్గం మాత్రం అణగారిన వర్గాల్లో ధైర్యాన్ని నింపుతూనే ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పండరంగీ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి. అలాగే జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లాకు ప్రభుత్వం మాన్యం యోధుడి పేరు పెట్టాలి’’ అని ప్రకటనలో పవన్ కోరారు.
A new district must be named after warrior of Manyam Alluri Sitharama Raju - JanaSena Chief Sri @PawanKalyan #AlluriSitaRamaRaju pic.twitter.com/eNUuVK9vWz
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2020