వెంకీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సినిమా `జాలీ ఎల్ఎల్బి2` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్‌ను తెలుగులో ప్రేమమ్గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఇప్పుడు జాలీ ఎల్ఎల్బి2 చిత్ర రీమేక్ హక్కులను 1.7 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నాడట.
అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ సినిమా రీమేక్‌లో వెంకటేష్ నటించనున్నాడని ముందు వార్తలు వినపడ్డాయి. కానీ త్రివిక్రమ్‌తో ఉన్న పరిచయం కారణంగా నిర్మాతగా పవన్ కళ్యాణ్‌ను బోర్డ్లోకి తీసుకురావాలనుకుంటున్నాడట. ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తాడని, దర్శకత్వం మాత్రం వేరే దర్శకుడు చేస్తాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout