పాక్ మీడియా కథనం పై పవన్ రియాక్షన్...
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాతో రెండేళ్ల కిందటే చెప్పారు’ అని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రజా పోరాటయాత్రలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గత నెల 26న ఆళ్లగడ్డలో జరిగిన సభలో ఆయన ‘యుద్ధం’ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే పవన్ ఈ మాటలు అనడం వెనుక ఆంతర్యమేంటి..? ఆయనకు ముందే ఎలా తెలుసు..? అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు పుంకాలు పుంకాలుగా అల్లేస్తున్నాయి.
పాక్ మీడియా ఏం రాసింది..?
‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అని ఇటీవల ఆళ్లగడ్డ బహిరంగ సభలో పేర్కొన్నారు. అయితే భారత్‌కు సంబంధించిన ఏ విషయాన్నైనా సరే పైత్యం జోడించి రాసే పాక్ మీడియా.. పవన్ మాటలను ఎక్కడ తెలుసుకుందో..? ఎలా తెలుసుకుందో గానీ.. దొరికింది కదా అని ‘డాన్ న్యూస్’ వెబ్ సైట్ యథాతథంగా ప్రచురించింది. అంతేకాదు దీనికి తోడు ఓ ఇంగ్లీష్ వెబెసైట్ పెట్టిన కథనాన్ని కూడా లింక్ చేసి హడావుడి చేసింది.
పాక్ మీడియా పైత్యం అంతా ఇంతా కాదు..!?
కాగా.. భారత్‌పై ఏదో ఒకరకంగా బురద జల్లడమే పాకిస్థాన్ మీడియా చేసే పని. అయితే పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, రియల్ హీరో అభినందన్ పాక్ చిక్కింది మొదలుకుని అప్పగింత వరకూ ఇలా పలు విషయాలపై మరింత పైత్యాన్ని ప్రదర్శిస్తూ పుల్వామా ఘటన దగ్గర నుండి అభినందన్ ను భారత్ కు పంపేదాకా ప్రతి ఒక్క అంశాన్ని భారత్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించడానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు.
పుల్వామా ఘటన గురించి భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీ (భారతీయ జనతా పార్టీ)కి వ్యతిరేకంగా భారత్‌లో ఎవరు మాట్లాడుతారా..? వారి గురించి ప్రముఖంగా ప్రచురిద్దామా? అని పాక్ మీడియా ఎదురు చూసింది. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పాక్ మీడియాను ఆకర్షించాయి. ఇంకేముంది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించాయి. అయితే ఆయన అన్న మాటలకు అర్థం వేరే కానీ ఏదో ఊహించుకుని తెలుగు మీడియా సైతం కథనాలు అల్లేశాయి.
పవన్ రియాక్షన్..
"చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి" అని పవన్ ఇది వరకు మాట్లాడిన సభకు సంబంధించిన వీడియోను ట్వి్ట్టర్ వేదికగా జనసేన పోస్ట్ చేసింది.
No one told me about a possible warlike situation before elections. Many who follow prominent political analysts and news channels know this and I was just mentioning them - JanaSena President @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) March 1, 2019
We request Indian media to stop misleading the people of this country. pic.twitter.com/wkERFtP51C
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments