పాక్ మీడియా కథనం పై పవన్ రియాక్షన్...

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాతో రెండేళ్ల కిందటే చెప్పారు’ అని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రజా పోరాటయాత్రలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గత నెల 26న ఆళ్లగడ్డలో జరిగిన సభలో ఆయన ‘యుద్ధం’ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే పవన్ ఈ మాటలు అనడం వెనుక ఆంతర్యమేంటి..? ఆయనకు ముందే ఎలా తెలుసు..? అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు పుంకాలు పుంకాలుగా అల్లేస్తున్నాయి.

పాక్ మీడియా ఏం రాసింది..?

‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అని ఇటీవల ఆళ్లగడ్డ బహిరంగ సభలో పేర్కొన్నారు. అయితే భారత్‌‌కు సంబంధించిన ఏ విషయాన్నైనా సరే పైత్యం జోడించి రాసే పాక్ మీడియా.. పవన్ మాటలను ఎక్కడ తెలుసుకుందో..? ఎలా తెలుసుకుందో గానీ.. దొరికింది కదా అని ‘డాన్ న్యూస్’ వెబ్ సైట్ యథాతథంగా ప్రచురించింది. అంతేకాదు దీనికి తోడు ఓ ఇంగ్లీష్ వెబె‌సైట్‌‌ పెట్టిన కథనాన్ని కూడా లింక్ చేసి హడావుడి చేసింది.

పాక్ మీడియా పైత్యం అంతా ఇంతా కాదు..!?

కాగా.. భారత్‌పై ఏదో ఒకరకంగా బురద జల్లడమే పాకిస్థాన్ మీడియా చేసే పని. అయితే పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌, రియల్ హీరో అభినందన్ పాక్ చిక్కింది మొదలుకుని అప్పగింత వరకూ ఇలా పలు విషయాలపై మరింత పైత్యాన్ని ప్రదర్శిస్తూ పుల్వామా ఘటన దగ్గర నుండి అభినందన్ ను భారత్ కు పంపేదాకా ప్రతి ఒక్క అంశాన్ని భారత్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించడానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు.

పుల్వామా ఘటన గురించి భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీ (భారతీయ జనతా పార్టీ)కి వ్యతిరేకంగా భారత్‌లో ఎవరు మాట్లాడుతారా..? వారి గురించి ప్రముఖంగా ప్రచురిద్దామా? అని పాక్ మీడియా ఎదురు చూసింది. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పాక్ మీడియాను ఆకర్షించాయి. ఇంకేముంది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించాయి. అయితే ఆయన అన్న మాటలకు అర్థం వేరే కానీ ఏదో ఊహించుకుని తెలుగు మీడియా సైతం కథనాలు అల్లేశాయి.

పవన్ రియాక్షన్..

చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి అని పవన్ ఇది వరకు మాట్లాడిన సభకు సంబంధించిన వీడియోను ట్వి్ట్టర్‌ వేదికగా జనసేన పోస్ట్ చేసింది.

More News

నాగసౌర్య , మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు...వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ

యావత్ భారత్‌ను కంటతడిపెట్టించిన మహిళా ఫైలట్‌..

భార్య భర్తలిద్దరూ ఇండియన్‌‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్‌ లీడర్‌‌‌‌‌లు. భారత్ గడ్డపై పుట్టినందుకుగాను దేశానికి తమవంతుగా సేవ చేయాలని భావించి ఇద్దరూ ఎయిర్‌‌ఫోర్స్‌‌లో చేరారు.

'పీకే' అంటే పవన్ కల్యాణ్.. మరి పాక్‌‌లో..!

పీకే అంటే మన దేశంలో టక్కున గుర్తొచ్చే పేర్లు రెండే.. టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్..

యండమూరి "దుప్పట్లో మిన్నాగు" టీజర్ విడుదల

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ ‌

బ్లాక్ అండ్ వైట్ సినిమాలో న‌య‌న‌తార‌

న‌య‌న‌తార ఇప్పుడు కేవ‌లం ఓ హీరోయిన్ మాత్ర‌మే కాదు. లేడీ సూప‌ర్‌స్టార్‌. కేవ‌లం ఆమె పాత్ర‌ల కోసం థియేట‌ర్ల‌కు జ‌నం క్యూ క‌డుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.