'అన్నయ్య' హనుమాన్ ట్వీట్‌పై 'తమ్ముడు' రియాక్షన్ ఇదీ..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తర్వాత యమా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవలే ఏప్రిల్-08తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి.. ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ డేట్‌తో చిరుకు ఏం అనుబంధం ఉంటుందబ్బా..? అని మెగాభిమానులు, ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా ఎట్టకేలకు ఎనిమిదిన తన లైఫ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని చెప్పేశాడు మెగాస్టార్. హనుమాన్ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అన్నయ్య చేసిన ఈ ట్వీట్‌కు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యాడు.

అప్పట్లో నేను కూడా..

‘అన్నయ్య చిరంజీవిగారి ద్వారా హనుమంతుడు మా ఇంట కొలువుదీరారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ భావాలున్న మా నాన్నగారు కూడా శ్రీరామునికి అపరభక్తుడిగా మారిపోయారు. అలాగే నేను కూడా అప్పట్లో యుక్త వయసులో ఉన్నపుడు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాడిని.. జై హనుమాన్’ అని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. అన్నయ్య ట్వీట్‌ను పవన్ రీ ట్వీట్ కూడా చేశారు.

చిరు ఏం ట్వీట్ చేశారు..

‘1962లో లాటరీలో హనుమంతుని బొమ్మ వచ్చింది. అప్పట్నుంచి ఆ బొమ్మను తనవద్దే భద్రంగా దాచుకున్నాను. నా కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం హనుమంతుని మాదిరిగా ఉన్నాయని మా నాన్నగారు చెప్పేవారు. ఆ తర్వాత ప్రఖ్యాత దర్శకులు బాపు ఒక సందర్భంలో హనుమంతుని బొమ్మ గీస్తుండగా మీ పోలికలే వచ్చాయని చెప్పారు. మా ఇంట్లో పెట్టుకునేందుకు హనుమంతుని చిత్రం ఒకటి ఆయన చిత్రీకరించి పంపారు. ఆ చిత్రాన్ని పాలరాతిపై రీ ప్రొడ్యూస్ చేసుకుని ప్రస్తుతం పూజ గదిలో భద్రంగా ఉంచి పూజిస్తున్నాను’ అని పవన్ ట్వీట్ చేసిన విషయం విదితమే. ఈ ట్వీట్‌పై అభిమానులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ కామెంట్ల వర్షం కురిపించారు.