పవన్ - రవితేజ: ఈ క్రేజీ కాంబినేష‌న్ కుదిరేనా?

  • IndiaGlitz, [Tuesday,April 07 2020]

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ అనౌన్స్‌మెంట్ ముందు నుండే  భారీ అంచ‌నాలను ఏర్ప‌రుచుకుంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. ఇదొక భారీ మ‌ల్టీస్టార‌ర్ . సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో ఈ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంద‌ట‌. డైరెక్ట‌ర్ బాబీ ఈ సినిమాను తెర‌కెక్కించుంద‌ని కూడా సోష‌ల్ మీడియాలో న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి వ‌కీల్ సాబ్‌. మ‌రో సినిమాను క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ సినిమాను చేస్తున్నారు. కాగా మ‌రో సినిమాగా ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇప్పటికే ప‌వ‌న్‌తో డైరెక్ట‌ర్ బాబీ స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్‌ను ..ర‌వితేజ‌తో ప‌వ‌ర్ సినిమాను తెర‌కెక్కించాడు. అంతా ఓకే అయితే ఈ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ను బాబీ డైరెక్ట్ చేయ‌నున్నాడు. మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్ కుదిరేనా?  తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

More News

ఇలియానా షాకింగ్ డెసిష‌న్‌..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను

అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

ఈరోజు వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశ‌మంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు.

బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.

భారత్ పెద్ద మనసు: ఎట్టకేలకు అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్..

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు