పవన్ - రానా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. అతి త్వరలో ఫస్ట్ సింగిల్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ ఖరారు చేసుకోగా.. ఏ రోజున విడుదలవుతుంది అనేది మాత్రం ప్రకటించలేదు.
తాజాగా అది కూడా అనౌన్స్ చేసేశారు. జనవరి 12, 2022న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. భారీ చిత్రాల రిలీజ్ తో టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ హీటెక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.
అతి త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. రికార్డింగ్ స్టూడియోలో పవన్, తమన్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర సాంగ్ రికార్డింగ్ లో పాల్గొంటున్న దృశ్యాల్ని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అదిరిపోయే మాస్ నంబర్ రెడీ అయింది అంటూ తమన్ ట్వీట్ చేశాడు.
ఇక ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి.. ఇప్పుడే చెబితే దిష్టి తగులుతుంది.. మీరే అర్థం చేసుకోండి' అని అంచనాలు పెంచేశారు. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ శరవేగంగా జరుగుతోంది. పవన్ సరసన నిత్యామీనన్ తొలిసారి నటిస్తోంది. రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటించనుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఇక సంక్రాంతికి జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్, 13న మహేష్ సర్కారు వారి పాట, 12న పవన్- రానా చిత్రం విడుదల కానుండడం అధికారికంగా ఖరారయ్యాయి. భారీ స్టార్స్ అంతా ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారనుంది.
Gear up for the Biggest Battle of Self-Esteem, #ProductionNo12 in theatres 12 Jan 2022 ⭐??
— Sithara Entertainments (@SitharaEnts) August 2, 2021
Be ready to experience the FIRST SINGLE veryy soonnn ??
Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @MenenNithya @saagar_chandrak @vamsi84 @NavinNooli pic.twitter.com/nOfZZiLs5e
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com