పవన్ - రానా మూవీ రిలీజ్ డేట్ ఇదే.. అతి త్వరలో ఫస్ట్ సింగిల్

  • IndiaGlitz, [Tuesday,August 03 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ ఖరారు చేసుకోగా.. ఏ రోజున విడుదలవుతుంది అనేది మాత్రం ప్రకటించలేదు.

తాజాగా అది కూడా అనౌన్స్ చేసేశారు. జనవరి 12, 2022న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. భారీ చిత్రాల రిలీజ్ తో టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ హీటెక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.

అతి త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. రికార్డింగ్ స్టూడియోలో పవన్, తమన్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర సాంగ్ రికార్డింగ్ లో పాల్గొంటున్న దృశ్యాల్ని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అదిరిపోయే మాస్ నంబర్ రెడీ అయింది అంటూ తమన్ ట్వీట్ చేశాడు.

ఇక ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి.. ఇప్పుడే చెబితే దిష్టి తగులుతుంది.. మీరే అర్థం చేసుకోండి' అని అంచనాలు పెంచేశారు. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ శరవేగంగా జరుగుతోంది. పవన్ సరసన నిత్యామీనన్ తొలిసారి నటిస్తోంది. రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటించనుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఇక సంక్రాంతికి జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్, 13న మహేష్ సర్కారు వారి పాట, 12న పవన్- రానా చిత్రం విడుదల కానుండడం అధికారికంగా ఖరారయ్యాయి. భారీ స్టార్స్ అంతా ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారనుంది.

More News

ఆ క్రెడిట్ తన కొడుక్కే ఇచ్చిన రాజమౌళి.. దోస్తీ సాంగ్ పై తొలిసారి..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాలు మొదలు పెట్టింది.

'పరిగెత్తు పరిగెత్తు' మూవీ రివ్యూ!

క్రైమ్ జోనర్ లో తెరకెక్కే థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది.

షాకిస్తున్న బాలయ్య, బోయపాటి సాహసం ?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో

క్రేజీ థ్రిల్లర్ చిత్రానికి రూ. 100 కోట్ల బడ్జెట్

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల బడ్జెట్ లెక్కలు మారిపోయాయి. కథ బావుంటే ఎంతైనా ఖర్చు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

క్రైమ్, పాలిటిక్స్, యాక్షన్ తో విజయ్ ఆంటోని 'విజయ రాఘవన్' ట్రైలర్

బిచ్చగాడు చిత్రంతో పాపులర్ అయిన విజయ్ ఆంటోని వైవిధ్యమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.