పవర్ స్టార్ వెర్షస్ సూపర్ స్టార్

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - సూప‌ర్ స్టార్ మ‌హేష్ వీరిద్ద‌రూ నెం 1 స్ధానం కోసం పోటీప‌డుతున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. స‌ర్ధార్ ఆడియో రిలీజైంది. సెన్సార్ కూడా పూర్త‌య్యింది. ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్ధార్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక మ‌హేష్ న‌టించిన తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చివ‌రి షెడ్యూల్ ఏప్రిల్ 2న నుంచి చేయ‌నున్నారు. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ఆడియోను, మే నెల‌లో బ్ర‌హ్మోత్స‌వం సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఇంచు మించు నెల రోజుల గ్యాప్ లో ప‌వ‌ర్ స్టార్ - సూప‌ర్ స్టార్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మ‌హేష్ బాబు వీరిద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఓవ‌ర్ సీన్ రైట్స్ 11.5 కోట్లుకు అమ్ముడ‌వ్వ‌గా, మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం ఓవ‌ర్ సీస్ రైట్స్ 13 కోట్లుకు అమ్మేర‌ట‌. ఇక శాటి లైట్స్ రైట్స్ విష‌యానికి వ‌స్తే..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ 13 కోట్లకు అమ్మితే...బ్ర‌హ్మోత్స‌వం శాటిరైట్స్ 11.5 కోట్లుకు అమ్మిన‌ట్టు స‌మాచారం. ఓవ‌ర్ సీస్ రైట్స్ విష‌యంలో ప‌వ‌న్ కంటే మ‌హేష్ పైచేయి సాధిస్తే..శాటిలైట్ రైట్స్ విష‌యంలో మ‌హేష్ కంటే ప‌వ‌న్ పై చేయి సాధించాడు. బిజినెస్ ప‌రంగా ఈవిధంగా పోటీప‌డిన ప‌వ‌ర్ స్టార్ - సూప‌ర్ స్టార్ సినిమాల రిలీజ్ త‌ర్వాత రికార్డ్స్ విష‌యంలో ఎలా పోటీప‌డ‌తారో..? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.