close
Choose your channels

పవన్ గురించి రజనీకాంత్ కామెంట్...

Monday, February 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజు - ఇమేజు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. సినిమాలు స‌రే...రాజ‌కీయాల‌ను సైతం ప్ర‌భావితం చేసేంత ప‌వ‌ర్ ఉన్న స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ప‌వ‌ర్ స్టార్ గురించి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఓ కామెంట్ చేసార‌ట‌. కామెంట్ అన‌డం క‌న్నా ప‌వ‌న్ గురించి జోష్యం చెప్పార‌న‌డం క‌రెక్ట్. ఇంత‌కీ ప‌వ‌న్ గురించి ర‌జ‌నీ చెప్పిన జోష్యం ఏమిటి..? ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది అనుకుంటున్నారా..?
క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ క‌థానాయ‌కుడు సినిమా షూటింగ్ గ్యాప్ లో జ‌ల్సా పేప‌ర్ యాడ్ ని ర‌జ‌నీకాంత్ కి చూపించి ఈ సినిమా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ నా ఫ్రెండ్..ఇప్పుడు పెద్ద డైరెక్ట‌ర్ అని చెబితే...ర‌జనీకాంత్ ఆ విష‌యం నాకు తెలుసు అని ప‌వ‌న్ స్టిల్ చూపిస్తూ...తెలుగులో నెక్ట్స్ సూప‌ర్ స్టార్ ఇత‌నే అని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని సునీల్ మీడియాతో పంచుకున్నారు. కాక‌పోతే సునీల్ కి ర‌జ‌నీకాంత్ అంత క‌రెక్ట్ గా ఎలా చెప్ప‌గ‌లిగార‌ని ఇప్ప‌టికీ ఆ విష‌యం గురించి ఆలోచిస్తుంటార‌ట‌.ద‌టీజ్ ర‌జ‌నీకాంత్ అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.