పవన్ గురించి రజనీకాంత్ కామెంట్...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజు - ఇమేజు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. సినిమాలు స‌రే...రాజ‌కీయాల‌ను సైతం ప్ర‌భావితం చేసేంత ప‌వ‌ర్ ఉన్న స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ప‌వ‌ర్ స్టార్ గురించి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఓ కామెంట్ చేసార‌ట‌. కామెంట్ అన‌డం క‌న్నా ప‌వ‌న్ గురించి జోష్యం చెప్పార‌న‌డం క‌రెక్ట్. ఇంత‌కీ ప‌వ‌న్ గురించి ర‌జ‌నీ చెప్పిన జోష్యం ఏమిటి..? ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది అనుకుంటున్నారా..?
క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ క‌థానాయ‌కుడు సినిమా షూటింగ్ గ్యాప్ లో జ‌ల్సా పేప‌ర్ యాడ్ ని ర‌జ‌నీకాంత్ కి చూపించి ఈ సినిమా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ నా ఫ్రెండ్..ఇప్పుడు పెద్ద డైరెక్ట‌ర్ అని చెబితే...ర‌జనీకాంత్ ఆ విష‌యం నాకు తెలుసు అని ప‌వ‌న్ స్టిల్ చూపిస్తూ...తెలుగులో నెక్ట్స్ సూప‌ర్ స్టార్ ఇత‌నే అని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని సునీల్ మీడియాతో పంచుకున్నారు. కాక‌పోతే సునీల్ కి ర‌జ‌నీకాంత్ అంత క‌రెక్ట్ గా ఎలా చెప్ప‌గ‌లిగార‌ని ఇప్ప‌టికీ ఆ విష‌యం గురించి ఆలోచిస్తుంటార‌ట‌.ద‌టీజ్ ర‌జ‌నీకాంత్ అదీ సంగ‌తి.

More News

ఆడియెన్స్ కు కనెక్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను - ఆదాశర్మ

పివిపి నిర్మాణ సంస్థ,మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం’.

దర్శకుడి తమ్ముడని అవకాశం రాలేదు - వేదా.కె

మంచు మనోజ్,రెజీనా హీరో హీరోయిన్లుగా బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్ పై కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం శౌర్య.

పూజలు చేస్తున్న మహేష్ - సమంత.

మహేష్ -సమంత పూజలు చేస్తుంది దేని కోసం అనుకుంటున్నారా..?

మలయాళీ దేవతగా రమ్యకృష్ణ...

అందం-అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు.

అమరావతిలో సర్ధార్ ఆడియో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.బాబీ తెరకెక్కిస్తున్న సర్ధార్ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.