'చంద్రబాబు చేస్తున్న పనికి భయమేసింది.. ఎందుకింత కక్ష జగన్..'

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని.. అమరావతి తరలిస్తారన్న ప్రకటన అనంతరం రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజధానికి భూములిస్తున్న రైతన్నలకు మద్దతుగా, అండగా నిలిచేందుకు పవన్ ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతులకు మద్దతు తెలిపిన అనంతరం మీడియాతో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు సీఎంగా చంద్రబాబు.. రాజధానికోసం 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందన్నారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేరని.. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందన్నారు. పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రైతులు భూమిలిచ్చారని.. చంద్రబాబుపై, ఓ వ్యక్తిపై భరోసాతో రైతులు భూములివ్వలేదని చెప్పుకొచ్చారు.

జగన్ ఎందుకు చెప్పలేదు!

‘ప్రభుత్వంపై భరోసాతో రైతులు భూములిచ్చారు. ప్రభుత్వమే మాట తప్పడం దారుణం. అమరావతి రాజధానికి అసెంబ్లీలో జగన్‌ ఆమోదం తెలిపారు.రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుంది. భూములమ్మితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చింది.. అస్థిరత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదు. అమరావతికి వ్యతిరేకమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు చెప్పలేదు. రాజధాని విషయంలో జగన్‌ ధర్మం తప్పారు. ధర్మం తప్పిన వ్యక్తిని ఈ నేల క్షమించదు’ అని పవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకింత కక్ష జగన్!?

‘అమరావతిపై జగన్‌కు ఇంత కక్ష ఎందుకు?. అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను శిక్షించండి. కొందరు వ్యక్తులపై కోపం... ప్రజలందరిపై చూపించొద్దు. రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుంది. ఓట్ల గురించి కాదు.. మార్పు గురించే నా ప్రయత్నం. ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకునే వాడిని కాదు. భూమిని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలి. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా ముందుకెళ్లొద్దు. హైకోర్టు విషయంలో సీమ ప్రజలను మభ్యపెడుతున్నారు. అమరావతిని ఎడారి అనడం ఆందోళనకారులను పెయిడ్‌ ఆర్టిస్టులనడం క్షమించరానిది. రైతుల ఆశయాలను కాపాడటం జనసేన ప్రధాన కర్తవ్యం. 151 సీట్లు పర్మినెంట్‌ కాదు.. ఏ క్షణమైనా కూలిపోవచ్చు’ అని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.

More News

చిరంజీవి చిత్రంలో రెజినా ఐటెం సాంగ్ ?

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్సును అద్భుతంగా కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో చేసే సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.

మహాభారతం గురించి రాజమౌళి తాజా అప్‌డేట్ ఇది...

జక్కన్న.. ఈ పేరుకు అతికినట్టు సరిపోతారు డైరెక్టర్ రాజమౌళి. టాలీవుడ్ చిత్ర శిల్పిగా పేరుతెచ్చుకున్న ఆయన సినిమా తీశారంటే.. శిల్పం చెక్కినట్టు అద్భుతంగా.. సినీ ప్రపంచం తనవైపు చూసేలా తెరకెక్కిస్తారు.

చెర్రీ కోసం మాస్ డైరెక్టర్ నిరీక్షణ..!

అల్లూరి సీతారామరాజు .. ఈ పేరు వినగానే కళ్లముందు కదలాడే నటుడు సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై సీతారామరాజుకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన నటుడిగా చిరస్థాయి నిలిచిపోయే కీర్తి సంపాదించారు.

ప్రధాని మోదీ నివాసంలో మంటలు.. ఎన్నో అనుమానాలు!!

ప్రధాని మోదీ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 7:25 గంటల సమయంలో లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

అజిత్‌కు కలిసొచ్చిన లక్.. ఆదిథ్యకు కొత్త శాఖ!

ఎవరి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఎవరికెప్పుడు లక్ కలిసొస్తుందో.. ఎప్పుడు సామాన్యుడు సెలబ్రిటీ అవుతాడో ఎవరికీ అర్థంకాదు.