ఇది ప్రజాస్వామ్యమా?.. దగాస్వామ్యమా?: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పల్నాడు ముఖద్వారమైన సరసరావు పేటలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఏపీ పోలీసులు, టీడీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ మాటల్లోనే....
"2014లో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఆశించకుండా మద్దతు తెలిపింది. ప్రజలందరికి న్యాయం చేస్తారని.. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసైనికులు మీద కేసులు పెట్టి చచ్చేట్లు కొడుతున్నారు. తెలుగుదేశం నాయకులు, నాయకురాళ్లకు ఒకటే చెబుతున్నాను.. మీరు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేంత విలువలు ఉన్నాయా మీకు..? పోలీసు అధికారులు గొడవలు తగ్గించాల్సింది పోయి కేసులు పెట్టి చావగొట్టారు. ఇది ప్రజాస్వామ్యమా..? దగాస్వామ్యమా..? పల్నాడు గడ్డ నుంచి చెబుతున్నాను... కేసులు, దాడులకు భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్. మీరు నియంత్రణ పాటిస్తే మేము నియంత్రణ పాటిస్తాం. మీరు హద్దులు దాటితే మిమ్మల్ని మించి హద్దులు దాటుతామన్నారు. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇది మా జెండా అని గుండె ధైర్యంతో తీసుకెళ్లే కార్యకర్తలు కేవలం జనసేన పార్టీకే ఉన్నారు. దోపిడి వ్యవస్థపై పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా జనసేన పార్టీ జెండా" అని పవన్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments