‘గబ్బర్ సింగ్’ ... పవన్ స్టామినాకు ఓ మార్క్
- IndiaGlitz, [Monday,May 11 2020]
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్... సక్సెస్, ఫెయిల్యూర్‌కి సంబంధం లేకుండా హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఏకైక టాలీవుడ్స్టార్. ఇలా చెప్పడానికి కారణం. సాధారణంగా ఓ హీరోకు ఏడాది, రెండు, మూడు ఏళ్లు హిట్స్ లేకపోతే ఉన్న పోటీ ప్రపంచంలో ప్రేక్షకులు వారిని మరచిపోతుంటారు. అలాంటిది పవన్‌కల్యాణ్‌కు ఖుషీ తర్వాత హిట్ అనేదే లేదు. పదేళ్ల వరకు ఆయన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై అభిమానం పెరుగుతూ వస్తూనే ఉంది కానీ తగ్గలేదు. దీనికి ఉదాహరణే గబ్బర్ సింగ్. ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్చేసింది. పవన్ అభిమాని అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆయన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు. నేను ట్రెండ్ ఫాలో కాను... ట్రెండ్ సెట్ చేస్తాను అని గబ్బర్‌సింగ్‌లో ఓ డైలాగ్ ఉంది. అలాగే ఈ సినిమాతో కలెక్షన్స్ పరంగా పవన్ సరికొత్త రికార్డుల ట్రెండ్ క్రియేట్ చేశాడు.
2012 మే 11న విడుదలైన గబ్బర్‌సింగ్ చిత్రం బాలీవుడ్ సినిమాకు దబాంగ్‌కు తెలుగు రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు హరీశ్ శంకర్ కథలో మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలై 8 ఏళ్లు అవుతున్నా ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధించిందో తెలుసుకోవచ్చు. ఈ రోజు ట్విట్టర్లో గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మిలియన్ ట్వీట్స్‌తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ హరీశ్, నిర్మాత బండ్ల గణేశ్ సినిమా గురించి తమ అనుభవాలను ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.