‘గ‌బ్బ‌ర్ సింగ్’ ... ప‌వ‌న్ స్టామినాకు ఓ మార్క్‌

  • IndiaGlitz, [Monday,May 11 2020]

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌... స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌కి సంబంధం లేకుండా హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఏకైక టాలీవుడ్‌స్టార్‌. ఇలా చెప్ప‌డానికి కార‌ణం. సాధార‌ణంగా ఓ హీరోకు ఏడాది, రెండు, మూడు ఏళ్లు హిట్స్ లేక‌పోతే ఉన్న పోటీ ప్ర‌పంచంలో ప్రేక్ష‌కులు వారిని మ‌ర‌చిపోతుంటారు. అలాంటిది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఖుషీ త‌ర్వాత హిట్ అనేదే లేదు. ప‌దేళ్ల వ‌ర‌కు ఆయ‌న సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్స్ అయ్యాయి. అయినా కూడా ఆయ‌న‌పై అభిమానం పెరుగుతూ వ‌స్తూనే ఉంది కానీ త‌గ్గ‌లేదు. దీనికి ఉదాహ‌ర‌ణే గబ్బ‌ర్ సింగ్‌. ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్‌చేసింది. ప‌వ‌న్ అభిమాని అయిన డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఆయ‌న్ని స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించాడు. నేను ట్రెండ్ ఫాలో కాను... ట్రెండ్ సెట్ చేస్తాను అని గ‌బ్బ‌ర్‌సింగ్‌లో ఓ డైలాగ్ ఉంది. అలాగే ఈ సినిమాతో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ప‌వ‌న్ స‌రికొత్త రికార్డుల ట్రెండ్ క్రియేట్ చేశాడు.

2012 మే 11న విడుద‌లైన గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రం బాలీవుడ్ సినిమాకు ద‌బాంగ్‌కు తెలుగు రీమేక్‌. అయితే తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్లు హ‌రీశ్ శంక‌ర్ క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కించారు. సినిమా విడుద‌లై 8 ఏళ్లు అవుతున్నా ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే సినిమా ఏ రేంజ్ విజ‌యాన్ని సాధించిందో తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ట్విట్ట‌ర్‌లో గ‌బ్బ‌ర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మిలియ‌న్ ట్వీట్స్‌తో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. డైరెక్ట‌ర్ హ‌రీశ్, నిర్మాత బండ్ల గ‌ణేశ్ సినిమా గురించి త‌మ అనుభ‌వాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు.

More News

రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమాకు ముహూర్తం అదేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో సినిమాలు చేయాల‌ని నేటి త‌రం క‌థానాయ‌కులంద‌రూ ఎదురుచూస్తుంటారు. బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళి..

బాలీవుడ్‌కి అన‌సూయ... నిజ‌మెంత‌?

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈమె త‌ర్వాత ర‌ష్మీ గౌత‌మ్ ఉన్నారు.

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది.

దిల్‌రాజు, ప్ర‌భాస్ చిత్రం... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.