అఫిడవిట్ ప్రకారం పవన్ ఆస్తులు ఇవీ...

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాలకు గాను పవన్ వరుసగా గురువారం, శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పవన్ తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

ఆస్తుల చిట్టా..

పవన్ పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు.. రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పవన్ కల్యాణ్ తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కోటి రూపాయల ఖరీదైన వోల్వో ఎక్స్‌సీ 90, 72లక్షల విలువైన మెర్సెడ్స్ బెంజ్ ఆర్ కారు, టయోటా ఫార్చునర్, స్కోడా ర్యాపిడ్, మహీంద్ర స్కార్పియో కార్లు, 32లక్షల ఖరీదైన హార్లీడేవిడ్‌సన్ హెరిటేజ్ సాఫ్టైల్ బైక్ ఉన్నట్లు పవన్ తన ఆస్తుల చిట్టాలో తెలిపారు.

అప్పులు

మొత్తం: రూ.32.40 కోట్లు
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర తీసుకున్న డబ్బులు: రూ.2.40 కోట్లు
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర తీసుకున్న డబ్బులు: రూ. 1.25 కోట్లు
వదిన సురేఖ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు : రూ.1.07 లక్షలు
ఎం.ప్రవీణ్ కుమార్‌కు ఇవ్వాల్సిన డబ్బులు : రూ.3 కోట్లు
ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌కు ఇవ్వాల్సిన డబ్బులు: రూ.2 కోట్లు
శ్రీ బాలాజీ సినీ మీడియాకు ఇవ్వాల్సిన డబ్బులు: రూ.2 కోట్లు
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు ఇవ్వాల్సిన డబ్బులు : రూ.27.55 లక్షలు.

More News

జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్‌

త‌మిళ‌నాడు దివ‌తంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించి మూడు బ‌యోపిక్స్‌ను అనౌన్స్ చేశారు.

జనసేన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు

లోక్‌స‌భ అభ్య‌ర్ధి అంటే రూ. 100 కోట్లు- రూ. 70 కోట్ల పెట్టుబ‌డి వ్యాపారం అయిపోయింద‌నీ, జ‌న‌సేన పార్టీ పెట్టుబ‌డి లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని నిర్మిస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్

భీమ‌వ‌రంను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతా...

"భీమవరం ప్రజల ప్రేమానుబంధాలు నన్ను కట్టిపడేశాయి. ఈ పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం నా బాధ్యత. రాజ‌కీయం భావ‌జాలంతో ముడిప‌డి ఉండాలి కానీ కులంతో కాద‌ని, త‌న‌కు కులం మ‌తం లేదు మాన‌వ‌త్వమే ఉంది"

వివేకా హత్యపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకా హత్యపై జనసేన అధినేత స్పందించారు. "ఇంత‌కీ అస‌లు పులివెందుల‌లో ఏం జ‌రుగుతోంది.

బాలయ్య, రాజశేఖర్‌ల 'విక్రమ్ వేద' పై.. 'వై నాట్' క్లారిటీ

మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తమిళ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ మూవీ మాధవన్, సేతుపతికి మంచి పేరు సంపాదించిపెట్టింది.