తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు: పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Friday,March 27 2020]
కరోనా వైరస్ నివారణా చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ తారలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, పేద సినీ కళాకారులను ఆదుకోవడానికి విరాళాలను ప్రకటించారు. దీనిపై జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్‌కు, కోటి రూపాయలు విరాళం ప్రకటించిన మహేశ్‌లకు కృతజ్ఞతలు తెలియజేసిన పవన్.. సినిమా పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించే తన పెద్ద అన్నయ్య చిరంజీవి..కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, టెక్నిషియన్స్‌కు కోటి రూపాయలు విరాళం ఇచ్చినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అలాగే తండ్రి అడుగు జాడల్లో నడిచిన రూ.70 లక్షలు విరాళం ప్రకటించిన రామ్‌చరణ్‌కు, రూ.75 లక్షలు విరాళం ఇచ్చిన తారక్‌కి, కోటి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని అందించిన బన్నీకి, తొలి విరాళంగా రూ.20 లక్షలు ప్రకటించిన నితిన్, రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన సాయితేజ్‌కి, రూ.20 లక్షలు రూపాయల విరాళం అందించిన త్రివిక్రమ్, కొరటాల శివ, దిల్‌రాజులకు, పదిలక్షల రూపాయలు అందించిన అనిల్ రావిపూడి, రూ.5 లక్షలు అందించిన తమన్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
వీరిందరితో పాటు పవన్‌కల్యాణ్ రెండు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. అందులో కోటి రూపాయలు ప్రధాని మంత్రి సహాయ నిధికి, రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలను విరాళాన్ని అందించారు.
పవన్ థాంక్స్‌కు మహేశ్, బన్నీ వంటి వారు ధన్యవాదాలు తెలిపారు.