పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!
- IndiaGlitz, [Friday,July 03 2020]
అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ సకాలంలో వెయ్యికి పైగా 104, 108 వాహనాలను తెప్పించి.. వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఆయన ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. దీనిని ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సుల్ని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం.. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూనే తెలంగాణకు చురకంటించారని నెటిజన్లు పేర్కొంటున్నారు. గత మూడు నెలలుగా.. అలసత్వం అనే మాటలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అన్నారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
— Pawan Kalyan (@PawanKalyan) July 3, 2020
ఆరంభించడం - అభినందనీయం ..
అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం..