పవన్ యాక్షన్‌లోకి దిగాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పిరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 14వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ఓ వీరుడి కథగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ పవన్ అభిమానులకు ఎంత కిక్ ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వీరమల్లుగా పవన్‌కళ్యాణ్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఇప్పటికే క్రిష్.. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ద్వారా చూపించేశారు. తాజాగా మరికొన్ని పిక్స్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ యాక్షన్ సన్నివేశాల కోసం కోచ్ సాయంతో ప్రాక్టిస్ చేస్తున్నట్టుగా పిక్స్‌లో కనిపిస్తోంది. వీరమల్లు సినిమా కోసం ఆయన ఏ స్థాయిలో ప్రాక్టీస్ అవుతున్నారో ఈ పిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపిచబోతున్నారు.
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆ కాలానికి తగ్గట్టుగా కనిపించేందుకు పవన్ కల్యాణ్ గెటప్.. ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిరియాడిక్ మూవీలో పవన్ నటించడం ఇదే తొలిసారి కావడంతో పాటు పవన్ ఒక దొంగగా నటించడం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ సినిమా 2022 సంక్రాంతిని టార్గెట్ చేస్తుండగా.. పవన్ తాజాగా నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments