జైపాల్‌రెడ్డి మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు!
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ మేధావి, రాజ నీతిజ్ఞుడు జైపాల్ రెడ్డి మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మరికొందరు అందుబాటులో ఉండే నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తాజాగా.. జైపాల్ మృతిపై జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
జైపాల్ రెడ్డి నిష్కళంకునిగా పేరు గాంచారు!
"తెలంగాణా ముద్దు బిడ్డ అయిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎంతో సంక్లిష్టమైంది. తెలుగుతో పాటు ఆంగ్ల భాషలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం వల్ల చట్ట సభలో ఆయన ప్రసంగాలు సభికులను ఆశ్చర్యపరిచేవి. నాలుగు సార్లు శాసనస సభకు, ఐదుసార్లు పార్లమెంట్‌కు జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందడం తెలుగు జాతి గర్వించదగిన విషయం. రెండుసార్లు కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన జైపాల్ రెడ్డి నిష్కళంకునిగా పేరు గాంచారు. నా తరపున, జనసేన పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని జనసేనాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments