జల్లికట్టు నిషేధం దక్షిణాది కల్చర్ పై దాడి - పవన్ కళ్యాణ్..!
Friday, January 20, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో జల్లికట్టు పై సుప్రీం కోర్టు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయం చేయాలంటూ తమిళనాడు అంతా ఒక్కతాటి పైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా యువత చెన్నైలోని మెరీనా బీచ్ కు చేరుకుని శాంతియుత మార్గంలో తమ నిరసన తెలియచేస్తున్నారు. తమిళ సినీ తారలు ఇప్పటికే తమ మద్దతు తెలియచేసారు. ఇక నిన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జల్లికట్టుకు సపోర్ట్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జల్లికట్టుకు ట్విట్టర్ ద్వారా తమ మద్దతు ప్రకటించారు. జల్లికట్టు, కోడిపందెలను ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేయడం అనేది ద్రావిడ కల్చర్ పై ఇండియాన్ గవర్నమెంట్ దాడిగా అభివర్ణించారు. దక్షిణ భారత ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసారని బాధపడుతున్నారు. ఈ విషయాన్ని షూటింగ్ కోసం పొలాచ్చి వెళ్లినప్పుడు పరిశీలించాను అని పవన్ కళ్యాణ్ తెలియచేసారు.
#Jallikattu #Kodipandem pic.twitter.com/gvpWrGtoFO
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2017
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments