అది వైసీపీకి దేవుడిచ్చిన వరం.. నేతలు కళ్లు తెరవాలి: పవన్

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ఏపీ ప్రభుత్వ పని తీరుతో పాటు పలు విషయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన చాలా రోజుల తర్వాత నేరుగా మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పని తీరు గురించి పవన్ మాట్లాడుతూ.. ‘‘151 సీట్లొచ్చాయి. బలమైన పార్టీగా ఉంది. ఇది వైసీపీకి భగవంతుడిచ్చిన వరం. దీనిని సద్వినియోగం చేసుకోవడం లేదుమోనని నా అభిప్రాయం. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. హైకోర్టులో 60 కేసులకు పైగా వ్యతిరేక తీర్పు రావడంతో నైనా తమ తప్పులున్నాయని గ్రహించాలి. ఇవన్నీ సరిచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు స్థిరమైన జీవన విధానం ఇవ్వాలి’’. అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ చెబుతోంది. పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి ప్రభుత్వం ప్రజలను సంతోష పెట్టే పనిలో ఉంది. ఇది ఎంతవరకూ సమంజసం అనే దానిపై పవన్ మాట్లాడుతూ.. ‘‘మనం సంపాదించే దానికంటే అప్పులు ఎక్కువగా ఉంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఓ తండ్రి అప్పులు చేసి పిల్లల్ని పెంచుతుంటే.. అప్పుడు ఆ పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. చివరకు అది కట్టలేక తండ్రి చేతులెత్తేస్తే అది పిల్లలపైనే భారం పడుతుంది.

ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి కానీ అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అభివృద్ధి అంటే దానికి మనం ఏం చేయలేం. దీనివల్ల ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు ఏమీ కాదు కానీ.. రాబోయే భావి తరాలపై భారం పడుతుంది. దీంతో ప్రజలు అణగారిపోయి ఉంటారు. వాళ్లను నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది. అప్పులు తెచ్చి ప్రజలకిచ్చే దానిని కచ్చితంగా అభివృద్ధి అనలేం. వైసీపీ నేతలు కళ్లు తెరిచి అభివృద్ధి పథం వైపు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.

More News

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. రాష్ట్రంలోనే తొలిసారిగా..

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రానా వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌(ఫ్యాన్ మేడ్)... వేదిక మార‌నుందా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

మ‌హేశ్‌కు భారీ ఆఫ‌ర్‌....?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుప‌తున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈపాటికే ఆయ‌న 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్‌పై ఉండేది.

ప్రియాంక స్థానం కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.