వైఎస్ జగన్ స్థానంలో నేనుంటే.. పవన్

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గురువారం విశాఖ ఉత్తర నియోజ‌క‌వర్గంలో బ‌హిరంగ‌స‌భ నిర్వహించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ ముందు (ప్రజల ముందు) మూడు పార్టీలు ఉన్నాయి.. స‌మ‌స్యలు కూడా ఉన్నాయి. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్థానంలో నేను ఉంటే మీ తరఫున అసెంబ్లీలో మాట్లాడేవాడిని, రోడ్డు మీద‌కి ఎక్కి కొట్లాడే వాడిని. ఒక్కడినే అసెంబ్లీలో ఉన్నా ముఖ్య‌మంత్రి చైర్ వ‌ద్దకు వెళ్లి మ‌రీ ప‌రిష్కరించే వాడిని. ఆయ‌న తీరు ఎలా ఉంది... ఏ స‌మ‌స్య చెప్పినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అంటారు.

ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన జ‌రిగేది అధికార బ‌ద‌లాయింపే. స‌మ‌స్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటాయి. ఈ త‌ర‌హా రాజ‌కీయాల్లో చెత్తను ఊడ్చేసేందుకే రెల్లి కులాన్ని స్వీక‌రించా. ప్రజా స‌మ‌స్యల మీద పోరాటం చేయాలంటే ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ. ఆయన్ని విశాఖపట్నం లోక్ సభ స్థానానికి మన పార్టీ అభ్యర్థిగా నిలిపాం. ప‌దేళ్ల భ‌విష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి అంటూ ఓటర్లకు పవన్ విజ్ఞప్తి చేశారు.

More News

జనసేనకు జనం బ్రహ్మరథం.. గంటా 'గంట' అంతే!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడు కాదు.. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డ‌బ్బుతో ప్రజాద‌ర‌ణను కొనుక్కోవాలనుకొంటున్నారు

మీ ఇంట్లో మనిషిగా గుర్తించండి.. ఒక్క ఫోన్ కాల్‌తో..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అన్నీ తీసేస్తాడంటూ టీడీపీ నాయ‌కులు దుష్ప్రచారం చేస్తున్నారు...

జగన్‌ను ఎలా నమ్మాలి.. అలీని వైసీపీలోకి ఎందుకు తీసున్నావ్!?

వైఎస్ఆర్సీపీ నాయ‌కుల‌కు జ‌న‌సేన పార్టీ అంటే అసూయ‌ అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి నిజాయ‌తీప‌రుల‌ను పార్టీలోకి

మే 17న అల్లు శిరీష్ 'ABCD' గ్రాండ్ రిలీజ్‌

యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్  'ABCD'.

21వ కళాసుధ ఉగాది అవార్డుల వేడుక

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతొ అవార్డులు అందించనున్నారు.