వెల్దుర్తి ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్

  • IndiaGlitz, [Saturday,May 11 2019]

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వోల్వో బస్సు-తుఫాన్ వ్యాన్, బైక్ ఢీ కొనడంతో 15 మంది చెందగా పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కాగా.. ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారని తెలియగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వాలు కళ్లెం వేయాలి..

గద్వాల జిల్లాకు చెందిన వీరు పెళ్ళి చూపులకు వెళ్లి వస్తుండగా మృత్యువాత పడ్డారని తెలిసి బాధ కలిగింది. ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మితిమీరిన వేగమే 15 మంది ప్రాణాలను హరించింది. ప్రయివేటు బస్సులు అతి వేగంతో వెళ్తున్నా రవాణా శాఖ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయి. రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేసి, వేగానికి కళ్లెం వేయాలి అని పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

More News

జగన్ అధికారంలోకి వస్తే మంత్రులు వీరే.. జాబితా హల్‌చల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్-11న జరిగిన ఎన్నికలకుగాను మే-23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మరోసారి విజయం మాదే..

'ABCD' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ కి ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

కర్నూల్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వోల్వో బస్సు-తుఫాన్ వాహనం, టూ వీలర్ బైక్ ఢీ కొన్నాయి.

ఎల్లో శారీ లేడీ ఆఫీసర్ అడ్రస్ దొరికిందోచ్..!!

ఇదిగో.. ఈ పచ్చ చీరలో ఉండే కనిపించే ఆంటీని చూస్తే మీకేం అనిపిస్తోంది..? ఇదేదో సినిమా సీన్‌లాగానో..? ఆమెను సినిమాలో హీరోయిన్‌గానో అనుకుంటున్నారు కదూ..!

హెలికాప్టర్‌ రిపేర్ చేసిన రాహుల్ గాంధీ..

ఇదేంటి.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమైనా మెకానికా..? హెలికప్టర్‌ రిపేర్ చేయడానికి అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు వింటున్నది నిజమే.