వెల్దుర్తి ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వోల్వో బస్సు-తుఫాన్ వ్యాన్, బైక్ ఢీ కొనడంతో 15 మంది చెందగా పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కాగా.. ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారని తెలియగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వాలు కళ్లెం వేయాలి..
"గద్వాల జిల్లాకు చెందిన వీరు పెళ్ళి చూపులకు వెళ్లి వస్తుండగా మృత్యువాత పడ్డారని తెలిసి బాధ కలిగింది. ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. మితిమీరిన వేగమే 15 మంది ప్రాణాలను హరించింది. ప్రయివేటు బస్సులు అతి వేగంతో వెళ్తున్నా రవాణా శాఖ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయి. రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేసి, వేగానికి కళ్లెం వేయాలి" అని పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments