పిఠాపురం, అంతర్వేది ఘటనలు యాధృచ్చికాలు కావు: పవన్

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

అంతర్వేదిలో రథం దహనమైన ఘటనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మతిస్థిమితం లేని వారు చేసిన పనో.. తేనె పట్టు కోసం చేసిన పనో అంటే పిల్లలు కూడా నవ్వుతారన్నారు. వరుస ఘటనలు యాథృచ్చికం అంటే ఎలా అని పవన్ మండిపడ్డారు. ‘‘మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట... ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్చికాలు కావు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు... రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయి? మతిస్థిమితం లేనివారి పని.. తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలి. ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలి. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు... హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలి. వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతాం. ఉగ్రవాద కోణం ఉంటే ఎన్ఐఏ దృష్టి సారించాలి’’ అని పవన్ పేర్కొన్నారు.

హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని కచ్చితంగా ఆపాలి..

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్‌కి సంబంధించిన వివాదంగానీ, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి కచ్చితంగా మాట్లాడాలి. ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే.

హిందూ మతం విషయంలో ఎందుకు స్పందించరు?

ప్రార్ధనా మందిరాలను అంటే ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారా అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు.

ఇది చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను..

రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ, ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు. మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా... నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

చిన్నపాటి యుద్ధానికి వేదికగా మారిన గాంధీభవన్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మీటింగ్ నిర్వహించాలన్నా.. గాంధీభవన్‌లోనే నిర్వహిస్తుంటారు. కానీ ఈ మధ్య గాంధీభవన్ బాహాబాహీలకు..

'డిటెక్టివ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశాల్‌

హీరో , నిర్మాత అయిన విశాల్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం డిటెక్టివ్ 2. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ రిలీజ్ చేసిన `రాధాకృష్ణ` చిత్రంలోని `తంగేడు పువ్వు` లిరిక‌ల్ వీడియో సాంగ్‌

``తంగేడు పువ్వులాంటి  నా బుగ్గ‌మీద నా సిందూరం పూసిండే  సిల‌కో... గుళ్ళోన గంట‌లాంటి నా గొంతు మీద‌నా మౌనాలు చ‌ల్లిండే మొల‌కో..నీలాల క‌న్నుల్లో మెరుపున్నోడే

కంగ‌నాకు షాకిచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్‌

ఓ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌కు షాకిచ్చాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చాడు.

రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రాజీవ్‌, సుమ క‌న‌కాల‌

టాలీవుడ్ టాప్ యాంక‌ర్ ఎవ‌ర‌న‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చే పేరు సుమ క‌న‌కాల‌.