ఆళ్లగడ్డలో మాట్లాడితే పాక్‌లో వినిపించింది: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
విద్యార్థుల నుంచి మంచి నాయకులు వస్తే కుటుంబ పాలనకి చరమగీతం పాడవచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలా అని రాజకీయాల పేరుతో విద్యార్ధుల చదువులు పాడుచేయడం తనకు ఇష్టం లేదన్నారు. చదువుకునే వారి ఓట్ల ద్వారా సమాజం ప్రభావితం అవ్వాలని.. ఉత్తమ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పవన్ సూచించారు. నెల్లూరు పర్యటనలో మాట్లాడిన పవన్.. ఆళ్లగడ్డలో మాట్లాడితే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వినిపించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అరుపులు కేకలతో మార్పు రాదు
"2019 ఎన్నికలు చాలా కీలకమైనవి. యువత ఓట్లు కూడా చాలా ముఖ్యం. దేశంలోని 220 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యువత ఓట్లే కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రతిపక్ష నాయకుడు 30 సంవత్సరాలు నా ఫోటో పెట్టుకోండి అంటారు. మరో నాయకుడు మళ్లీ మమ్మల్నే గెలిపించమంటారు. ఇలాంటి వ్యవస్థ మారాలి అంటే మనమంతా కలిస్తేనే అది సాధ్యం. నెల్లూరు విఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు కూడా మీలాగే వ్యవస్థ మీద ఎంతో కోపం ఉండేది. సీటు కావాలంటే రికమండేషన్స్. చదివిన చదువుకి సీటు కావాలి అంటే రికమండేషన్స్ ఏంటి? అప్పటికీ ఇప్పటికీ వ్యవస్థలో మార్పు రాలేదు. సమస్యలు ఇంకా పెరిగాయి. అయితే విద్యార్ధి దశలో పోరాటాలు చేసి ఆపేస్తారు. అరుపులు, కేకలతో మార్పు రాదు. లంచగొండితనం పోదు. ఓ ఆలోచనతో కూడిన నినాదంతో మార్పు వస్తుంది. ఆ మార్పు నేనే కావాలి అనుకున్నా. ఆళ్లగడ్డలో మాట్లాడితే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వినిపించింది" అని పవన్ గట్టిగా చెప్పుకున్నారు.
రూ.. వేల కోట్లు దోచేస్తున్నారు
"నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. సంపాదించిన డబ్బునే పంచేసిన వాడిని.. నేను ముఖ్యమంత్రి అయితే ఉన్న సంపదని అన్ని వర్గాలకీ సమంగా పంచిపెట్టే వ్యక్తినేగానీ, వేల కోట్లు దోచుకునే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వాన్ని నడిపించే ధర్మకర్తలు. క్యాబినెట్ అంటే ధర్మకర్తల సముహాం. మరి అలాంటి వారు వేలకోట్లు దోచుకుంటున్నారు. చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ రావడానికి కూడా మన మత్స్యకారులు దేహీ అని అడగాల్సిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిని అయితే వేలకోట్లు వెనకేసుకునే వాడిని కాదు. ప్రజలకు పంచిపెట్టే వాడిని. ఇక్కడ కూర్చొని మీకు అందుబాటులో ఉండే వ్యక్తులనే గెలిపించండి" అని పవన్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments