ఆళ్లగ‌డ్డలో మాట్లాడితే పాక్‌లో వినిపించింది: పవన్

  • IndiaGlitz, [Tuesday,March 05 2019]

విద్యార్థుల నుంచి మంచి నాయ‌కులు వ‌స్తే కుటుంబ పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడ‌వ‌చ్చని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. అలా అని రాజ‌కీయాల పేరుతో విద్యార్ధుల చ‌దువులు పాడుచేయ‌డం తనకు ఇష్టం లేదన్నారు. చ‌దువుకునే వారి ఓట్ల ద్వారా స‌మాజం ప్రభావితం అవ్వాలని.. ఉత్తమ నాయ‌క‌త్వాన్ని ప్రోత్సహించాల‌ని పవన్ సూచించారు. నెల్లూరు పర్యటనలో మాట్లాడిన పవన్.. ఆళ్లగ‌డ్డలో మాట్లాడితే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వినిపించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అరుపులు కేకలతో మార్పు రాదు

2019 ఎన్నిక‌లు చాలా కీల‌క‌మైన‌వి. యువ‌త ఓట్లు కూడా చాలా ముఖ్యం. దేశంలోని 220 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త ఓట్లే కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాయి. ప్రతిప‌క్ష నాయ‌కుడు 30 సంవ‌త్సరాలు నా ఫోటో పెట్టుకోండి అంటారు. మ‌రో నాయ‌కుడు మ‌ళ్లీ మ‌మ్మల్నే గెలిపించ‌మంటారు. ఇలాంటి వ్యవ‌స్థ మారాలి అంటే మ‌నమంతా క‌లిస్తేనే అది సాధ్యం. నెల్లూరు విఆర్ కాలేజీలో చ‌దువుకున్నప్పుడు నాకు కూడా మీలాగే వ్యవ‌స్థ మీద ఎంతో కోపం ఉండేది. సీటు కావాలంటే రిక‌మండేష‌న్స్‌. చ‌దివిన చ‌దువుకి సీటు కావాలి అంటే రిక‌మండేష‌న్స్ ఏంటి? అప్పటికీ ఇప్పటికీ వ్యవ‌స్థలో మార్పు రాలేదు. స‌మ‌స్యలు ఇంకా పెరిగాయి. అయితే విద్యార్ధి ద‌శ‌లో పోరాటాలు చేసి ఆపేస్తారు. అరుపులు, కేక‌ల‌తో మార్పు రాదు. లంచ‌గొండిత‌నం పోదు. ఓ ఆలోచ‌న‌తో కూడిన నినాదంతో మార్పు వ‌స్తుంది. ఆ మార్పు నేనే కావాలి అనుకున్నా. ఆళ్లగ‌డ్డలో మాట్లాడితే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో వినిపించింది అని పవన్ గట్టిగా చెప్పుకున్నారు.

రూ.. వేల కోట్లు దోచేస్తున్నారు

నాకు డ‌బ్బు మీద వ్యామోహం లేదు. సంపాదించిన డ‌బ్బునే పంచేసిన వాడిని.. నేను ముఖ్యమంత్రి అయితే ఉన్న సంప‌ద‌ని అన్ని వ‌ర్గాల‌కీ స‌మంగా పంచిపెట్టే వ్యక్తినేగానీ, వేల కోట్లు దోచుకునే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వాన్ని న‌డిపించే ధ‌ర్మక‌ర్తలు. క్యాబినెట్ అంటే ధ‌ర్మక‌ర్తల స‌ముహాం. మ‌రి అలాంటి వారు వేల‌కోట్లు దోచుకుంటున్నారు. చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ రావడానికి కూడా మన మత్స్యకారులు దేహీ అని అడగాల్సిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రిని అయితే వేల‌కోట్లు వెన‌కేసుకునే వాడిని కాదు. ప్రజ‌ల‌కు పంచిపెట్టే వాడిని. ఇక్కడ కూర్చొని మీకు అందుబాటులో ఉండే వ్యక్తుల‌నే గెలిపించండి అని పవన్ పిలుపునిచ్చారు.

More News

ఆకాశంలో 'బ్ర‌హ్మాస్త్ర‌'

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత నాగార్జున బాలీవుడ్‌లో న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మాస్త్ర'.ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఇత‌ర‌ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ట‌.

తప్పులో కాలేసిన మోదీ.. నలుగురిలో నవ్వుల పాలు!

గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన పేరు పాకిస్థాన్, అభినందన్, సర్జికల్ స్ట్రైక్స్‌‌ అనే విషయం తెలిసిందే. అయితే పదే పదే ప్రెస్‌‌మీట్స్, సభల్లో పలికిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నా

జనసేన కావలి అభ్యర్థి ఫిక్స్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ప్రజా పోరాట యాత్ర’లో భాగంగా పలువురు అభ్యర్థులను పరోక్షంగా ప్రకటించేస్తూ వస్తున్నారు. ఫలానా వ్యక్తిని ఆదరించండి.. చట్టసభలకు పంపుదాం అంటూ..

త్రిభాషా చిత్రంలో కీర్తి సురేష్‌

మ‌హాన‌టితో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఓ త్రిభాషా చిత్రంలో న‌టించ‌నుంది. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థతో పాటు ఓ ప్ర‌ముఖ టాలీవుడ్

‘మూత్రం’ స్టోర్ చేయండి.. వాటాన్ ఐడియా సర్‌ జీ!

ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. ఈ మాట అన్నది ఎవరో కాదండోయ్.. మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాడు నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక...