పవన్ టైటిల్ ఫిక్స్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన అనంతరమే మరో రెండు సినిమాలను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర రీమేక్‌తో పాటు ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం, డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రంలోనూ నటిస్తున్నారు.
అయితే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్రంపై అభిమానులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు కానీ, క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న చిత్రంపై మాత్రం భారీ అంచనాలున్నాయి. చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడనే వార్తలతో పాటు ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమవడం.. అలాగే ఈ చిత్ర టైటిల్ విషయంలో వినిపిస్తోన్న పేర్లు ఈ చిత్రాన్ని నిత్యం ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు ‘విరూపాక్ష’, ‘గజదొంగ’, ‘హరహర మహాదేవ్’, ‘ఓం శివమ్’, ‘బందిపోటు’ వంటి టైటిల్స్ హల్‌చల్ చేస్తూ వచ్చాయి.
ముఖ్యంగా ‘విరూపాక్ష’ టైటిల్ అయితే ఈ సినిమాకు ఫిక్స్ అన్నట్టుగా ప్రచారం జరిగింది. నిజానికి ఈ టైటిలే ఖరారయ్యేదేమో కానీ అప్పటికే మరో డైరెక్టర్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఉండటంతో క్రిష్ వెనక్కితగ్గారని టాక్. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఒక పవర్‌ఫుల్ టైటిల్ అయితేనే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ దీనికి ‘వీరమల్లు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమచారం. ఈ టైటిల్ సినిమాకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా త్వరలోనే రానున్నట్టు తెలుస్తోంది. ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments