పవన్ న్యూమూవీ అప్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది.
ఈ చిత్రం గురించి నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ లో స్పందిస్తూ...ప్రస్తుతం డైరెక్టర్ డాలీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ బిజీలో ఉన్నారు. పవన్ - శృతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను ఆగష్టులో ప్రారంభించనున్నాం అని తెలియచేసారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ - శృతి కలసి నటించిన గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ జంట ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com