పవన్ కొత్త సినిమా వివరాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, గౌతమ్ రాజు కెమెరా స్విచ్చాన్ చేసారు. ఎస్.జె.సూర్య గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్ర వివరాలను నిర్మాత శరత్ మరార్ తెలియచేస్తూ...ఖుషీ, పులి చిత్రాల తర్వాత పవన్ - ఎస్.జె.సూర్య కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది. ఒక ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. డైరెక్టర్ ఎస్.జె.సూర్య, రైటర్ ఆకుల శివతో కలిసి గత నాలుగు నెలలుగా ఈ సినిమా స్ర్కిప్ట్ రెడీ చేసారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలను రికార్డ్ చేయడం కూడా జరిగింది. బిల్లా, బెంగాల్ టైగర్ చిత్రాలకు వర్క్ చేసిన కెమెరామెన్ సౌందర్ రాజన్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను జూన్ లో ప్రారంభించనున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ - గౌతమ్ రాజు, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి, ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, కథ - మాటలు ఆకుల శివ, స్ర్కీన్ ప్లే - డైరెక్షన్ ఎస్.జె.సూర్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com