Vaishnav Tej:పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ప్రచారం

  • IndiaGlitz, [Wednesday,May 01 2024]

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు పవన్‌ను ఓడించాలని అధికార వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆర్థిక, అంగ బలంతో పవన్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే జనసేనాని కూడా ఈసారి వారి కుట్రలను ఛేదించి గెలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఓవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్, హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా పవన్ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బాబాయ్ గెలుపు కోసం అబ్బాయ్ వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగారు. గత శనివారం నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో వైష్ణవ్‌ తేజ్‌ పర్యటించనున్నారని కూటమి నేతలు తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నవఖండ్రవాడ నుంచి వైష్ణవ్‌ తేజ్‌ రోడ్డుషో ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తపల్లి మండలం కొండెవరం, ఇసుకపల్లి మీదుగా నాగులాపల్లి, రమణక్కపేట, రామరాఘవపురం, ముమ్మిడివారిపోడులో పవన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తదుపరి శ్రీరాంపురం నుంచి కోనపాపపేట, శీలంవారిపాలెం మీదుగా మూలపేట సెజ్‌ కాలనీ చేరుకుంటారు. అక్కడ నుంచి మూలపేట సెంటర్‌లో ప్రసంగిస్తారు. ఇక రామన్నపాలెం, అమీనాబాద్‌ సెంటర్‌ నుంచి యండపల్లి ఎస్సీ పేట, యండపల్లి జంక్షన్‌, కొత్తపల్లి మీదుగా ఉప్పాడ బీచ్‌రోడ్‌ సెంటర్‌ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని రాజకీయ, సినీ వర్గాల్లోనూ వినబడుతోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ గెలుపు కోసం ప్రచార బరిలోకి దిగడంపై అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో తమ నాయకుడు జనసేనాని గెలవడం ఖాయమని జనసైనికులు ధీమాతో ఉన్నారు.

More News

YCP Candidate Son:మా నాన్నను ఓడించండి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కుమారుడు పిలుపు..

ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో

Pension:ఒకటో తేదీ వచ్చింది.. పింఛన్ రాలేదు.. బ్యాంకులకు వెళ్లాలా అంటూ ఆగ్రహం..

తెల్లారింది... ఒకటో తేదీ వచ్చింది... ఎప్పట్లానే కరెన్సీ నోట్లతో గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా.. పెన్షన్ తీసుకో...

TDP manifesto- Modi:టీడీపీ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదా..? ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదు..?

ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో

Modi:తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మోదీ

తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. జహీరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. పంత్ ఇన్.. రాహుల్ ఔట్..

అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.